"బట్టుపల్లెలో యండలు యేమి సిన్నగ్గాచ్చాయా!"[1] అంటా మేకలమందను దొడ్లోకి తోల్తాడు బోయోళ్లెంగటసామిఁ![2]
ఆ మాట నా చెవులబడఁగానే శ్రీకృష్ణదేవరాయలు అప్పుడెప్పుడో జెప్పినమాట గుర్తుకొస్సాది. "దేశభాషలందు తెలుగు లెస్స" అన్న్యాడంటే ఊరికే అన్న్యాడా? రాయలవారికి తెలుగు, సంస్కృతమ్, కన్నడ, తుళు, ... ఇట్టా దేశంలో ఉండే నానా బాసలన్నీ తెలుసుగాబట్టి, తిరిగి సూసినాడు గాబట్టి ఆమాట అనగలిగినాడంట. మా యంగటసామిఁగుడకా[3] అంతే. యంగటసామిఁకి బట్టుపల్లె, బాలగ్గారిపల్లె, బాలసానోళ్లపల్లె, ఈరబల్లె, ఈడిగపల్లె, గుఱ్ఱప్పగారిపల్లె, తురకపల్లె, తూరుబ్బల్లె, పాలెంపలము, పోలోళ్లపల్లె, ... ఇట్టా దేశంలో ఉండే నానా ఊళ్లన్నీ తెలుసుగాబట్టి, తిరిగి సూసినాడుగాబట్టి ఆ మడిసి మాటకు వొగ యిలువ. "బట్టుపల్లెలో యండలు యేమి సిన్నగ్గాచ్చాయా!" అన్న్యాడంటే ఊరికే అన్న్యాడా? వొగ అర్తముండాది.
వొగ పర్తం[4]గూడా ఉండాదిమడే[5]. పొద్దు బారడన్నా పైకెక్కందే మ్యాకలు నీళ్లకోసరం తావటిచ్చి మేత సాలిచ్చి వొగదాన్నొగటి తోసుకుంటా దొబ్బుకుంటా[6] ఇంటిదోవబడ్తే యెవురికైనా బాదేగదా! బట్టుపల్లెలో యండలేం సిన్నగ్గాచ్చాయా!? "యేమబ్బా నీ బట్టుపల్లెలోనే గాచ్చాండాయా లోకానికి యిచిత్రంగా యింగ్యాడా గాయడంల్యా?" అని అడిగి సూడండి. యంగటసామికి యాడగాలాల్నో ఆడగాల్తాది. "యిరుడ్డమంటే[7] చెరిసగమనే రకంగా వుండాదే నీ యవ్వారమూ. యావూళ్లో యంతగాచ్చే నాకేమక్కర? నా మ్యాకల్నేమన్నా మెయ్యనిచ్చేట్టిగా వుండాయా ఈ యండలు!?" అని సుఱ్ఱుమంటాడు. మ్యాకజీవాలు యండగాల్తాండాయనే గానీ, యెంత యండ గాసినా యంగటసామినేమీ జేస్కోలేదు.
సావోడు పాపం, యంగటసామే లెక్కబెట్టకపోతే ఇంగ మావూళ్లో యండను లెక్కబెడతాన్నిందెవురు? పండు ముసిలోళ్లుగూడా ఇసనకఱ్ఱల్తో యిసురుకుంటానే, వుడుకుబోస్సాందని[8] తిట్టుకుంటానే, వుమ్మదిచ్చిందంటే[9] వానబడ్తాదేమోనని జోస్యంజెబుతానే, చమటకాయల నవ్వకు తట్టుకోల్యాక పిల్లకాయల్తో యీపున బరికిచ్చుకుంటానే, వాళ్లకు పేండ్లుజూచ్చా, బారాకట్టె[10] ఆడుకుంటా, కతలు జెప్పుకుంటా, పొడుపుకతలు పొడుసుకుంటా, ఆసికాలాడుకుంటా[11], ఆ మద్యలోనే యెప్పుడో రోంచేపు[రవ్వంత సేపు] గురకబెట్టి, పైటాల[12] దాఁకా పొద్దుబోగొట్టేవోళ్లే.
ముసిలోళ్లే అట్టుంటే పిల్లకాయల సంగతి సెప్పాల్నా!? మిట్టమద్యానం గూడా చేండ్లంబడీ[13] గుట్టలంబడీ తిరిగేపనే. ఒట్టికాళ్లతోనే. ఎవురికీ మెట్లుండవు[14]. వున్యాగానీ తొడుక్కునేదానికి వొళ్లుబరువు. అది గాపోతే మతిమరుపు. పొద్దన్నే వంకలేకి యనమల[15] తోలుకోంబోతే రేడియోలో చిత్రసీమ సిలింజీతాలు కూడా ఐపోకముందే యండదెబ్బకు తట్టుకోల్యాక మంతిరిచ్చినిట్టు[16] మోరలు[17] పైకెత్తుకోని సక్కంగా ఇంటికొచ్చి కుడిత్తొట్లో ముంచేటియ్యి. యంతసేపు గుక్కబడతాయో యేమో ముంచిన మోర బైటికిదీసేలోగా దొక్కలు ఉబ్బేదాఁక తాగి కుడితినీళ్ల తొట్టి సుమారుగా ఖాళీజేసిపారేస్సాయి. మోరలు నీళ్లల్లో ముంచినంచేపూ[18] - ఈగలు కుట్టనీగాక, ఎవురన్నా కొట్టనీగాక - ఘోరతపస్సు జేచ్చాండాయేమో అన్నిట్టు మెదలకండా తాగుతానేవుంటాయ్. అదీమడే యంగటసామి జెప్పిందాంట్లో ఉండే పర్తం.
చిత్రసీమ "సిలింజీతా"లనే అనుకున్న్యాం శాన్నాళ్లదాంకా. ఫిలిం-గీతాలు అని పెద్దయినాంక తెలిసింది. పొద్దున్నే గం.9.40కి ఆకాశవాణి కడపకేంద్రం చిత్రసీమ పాటలతో ప్రభాత ప్రసారం సమాప్తమైతాది. తిరిగి మూడువందల ముప్పైమూడు పాయింట్ మూడు మీటర్లూ అనగా తొమ్మిదివందల కిలోహెర్ట్జ్పై పదకొండు గంటలా నలభై నిముషాలకు తర్వాతి ప్రసారం ప్రారంభం. అంతవరకూ... ఏంది? అదిగూడా దెలీదా! నువ్వెప్పుడన్నా చిత్రసీమ సిలింజీతాలు యినింటే తెలిసేది.
అంతవరకూ సెలవు. ఎవురికి సెలవు? ఆకాశవాణికే. మాగ్గాదు. పదిగంటలకల్లా పిల్లకాయలంతా గొడ్లకూ, జీవాలకూ (గొఱ్రెలకూ మ్యాకలకూ) నీళ్లుదాపి సెట్లకిందనో దొడ్లోనో కట్టేసి సింతసెట్టుకిందికి జేరాలనేది మాకు మామూలు. యండ మరీ జాచ్చిగా[19] ఉన్నందంటే, పల్లెలో వుండే పిల్లకాయలంతా పొద్దు రోంత సల్లబడంగనే మా ఇంటికాడ చింతచెట్టు నీడన పోగౌతారు. మేమాడేది ముఖ్యంగా జిల్లాకోడి, పుట్టచెండు, గోలీలాట, బలుగూడు. యండాకాలం సెలవుల్లో అయితే రోజంతా ఆటలే. యండాలేదూ నీడాలేదూ దేన్నీ లెక్కజేసేదిలేదు.
"యండగా లేదంట్రా? అగ్గి మండిపోతాంది గదరా నాయనా, ఒళ్లు ఉడుకుజెయ్యదంట్రా?" ఎవురో ఒగరి అమ్మో అవ్వో వచ్చి అనేవోళ్లు. అదెవురికీ యినబడేదిగాదు. అసలు ఆడొక మడిసి ఉన్నిట్టుగా కూడా మాకెవ్వరికీ కనబడేదిగాదు. మాక్కనబడని సంగతి ఆ వొచ్చిన మనిసికి రెండు నిముషాల్లో అర్తమైపొయ్యేది. అప్పుడు "పిల్లకొవ్వు పిలిచ్చే పలుకుతాందిరా మీకు నా కొడకల్లాలా, మా(ప)టేలకు ఉచ్చల్లో రగతం బడతాది, అప్పుడు మీ తాత కనబడతాళ్లే ఉండండి! ..." అనేమాటగూడా మాకు అసలు యినబడేదేగాదు.
ఫుల్లుగా ఆడి, అలతజెంది అదరాబదరా కాళ్లూజేతులూ కడుక్కోని పీటలమీద కూసోవడమూ, మాకు ఇష్టమైన స్టీలు గిన్నెల్లో వేడివేడి అన్నమో సద్దసంగటిముద్దో సిద్ధం. అన్నంలోకైతే మామిడికాయ పప్పు లేదా పుల్లగూర. సంగట్లోకైతే కోడికూర ల్యాకపోతే చెనిగ్గింజల ఊరిమిండి ల్యాకపోతే చెనిగ్గింజలతో ఉడకబెట్టిన గురుగాకు పుల్లగూర, ల్యాపోతే గోగాకు ఊరిమిండి. నెయ్యి మామూలే, చెప్పాల్నా! ఆట్లాడితే అమితమైన ఆకలి. ఆవురావురుమనే ఆకలిలో అట్టాటి తిండి కండ్లముందు గిన్నెలో ఉంటే యింగేంగావాల!
"ఆకొన్నకూడె యమృతము" - అంటాడు సుమతీ శతకకర్త బద్దెన. అమృతమంటే ఏందో మాకు చిన్నప్పుడే తెలిసింది.
ఒకటే ఆటలు. ఎన్నిరకాల ఆటలో యేమో మాకే దిక్కుదెలీనన్ని. ఆ యండలకూ గాలికీ తిరిగి మాకు రాత్రికల్లా ఉడుకుజేసిందంటే చిన్న బాద గాదు. గజ్జల్లో సురుక్ సురుక్మని పీకుతాంటాది. ఒంటికిబొయ్యాలంటే సుక్క సుక్క బ్యాగ్ పైపర్ ...అదన్నమాట. ఒగో సుక్క బైటికి జారాలంటే తాతముత్తాతలు వర్సగా దిగిరావల్సిందే. దేవళం కాణ్ణించీ మైకులో లవకుశ పాటగూడా ఈమాటే జెబుతాంటాది - "విను వీధిని శ్రేణులుగా నిల్చి విడ్డూరముగా చూసెదరా... యే నిముషానికి యేమిజరుగునో". ఆడికీ పగులుపూట ఆడేటప్పుడు మాయవ్వ యెచ్చరిచ్చానే ఉంటాది "రేతిరికి గువ్వ సురుక్కుమంటాందను చెప్తా, నీ కజ్జెప్తా. అట్నే ఆడుకుంటాండు." మనకు యినబణ్ణ్యా, మిత్రద్రోహం చేసేరకం కాదుగనక మాసైన్యంతోపాటే నేనూ. నాబాధ సూళ్లేక మల్లా మాయవ్వే చెక్కరనీళ్లూ, మజ్జిగనీళ్లు, ఉంటేగనక టెంకాయనీళ్లూ పుల్లుగా పట్టించి హాయిగా నారపరుపులేసి మంచంమింద పండుకోబెడ్తే, మర్సురోజు తెల్లారిందాఁకా మనమీలోకంలో ఉండం.
జిల్లాకోడి[20] లో మనకు ఒక నైపుణ్యం ఉంది. గాల్లోనే మూడునాలుగేట్లు జిల్లను కొట్టడం. తగిల్తే ఇంగేముంది, గెలుపు మనదే. కాకపోతే ఎప్పుడో వొకసారే. పుట్టచెండు గుడకా మనం ఫరవాలేదు. బస్సాట, సిట్పట్ న్యాలా బండా, దొంగాపోలీస్ ఎన్నెన్నో. బలుగూడు[21] లోమాత్రం మనం పహిల్మాన్. నావల్ల రెండు జట్లకూ నష్టమేతప్ప లాబం లేదుగనక, నేను వొట్టొట్టి మిరపకాయను[22]. ఆడేవాళ్లంతా పెద్దోళ్లు. కానీ ఆడేది మా చింతచెట్టు కింద గదా? కాబట్టి నన్నుగూడా వోళ్లతోపాటు ఆడించుకోకంటే మాయవ్వ వొప్పుకోదు. బలుగూడు మాత్రం బలే తమాసా. కబడిక్కబడీ అని కూతకూసేటోళ్లు తక్కువ. నాకు గుర్తున్న కూతలు: చింతాకు పుల్లగూర తిందువురారా బామ్మర్దీ, చెట్టుకింద దయ్యం నాకేం బయ్యం, ఇంకోకటి ఉందిగానీ అది పిల్లకాయలకు సెప్పేదిగాదులే. ఈ కూతలన్నీ గుక్కతిప్పుకోకండా కూసేవాళ్లు. వొట్టి కబడిక్కబడిక్క... అనికూస్తే తమాసేముంది!?
బట్టుపల్లెకు తూరుపున ముట్టికొండ, ఉత్తరాన పాలకొండ. వొగణ్ణే ఆ కొండలదిక్కు జూస్తే రకరకాల ఆలాచన్లు. ఒక యండాకాలంలో మనకొక అనుమానమొచ్చింది. మా ముష్టికొండ కిందుండే నక్కలగుట్ట మధ్యలో నీటిబుగ్గ పుడితే, ఆ నీళ్లు నేరుగా గుట్టమధ్యలోనించీ పైకి చిమ్ముతాయా, ల్యాకపోతే, మధ్యలోనే బొక్కబెట్టుకోని బైటికొచ్చేస్సాయా - అని. కానీ ఎట్టా తెలుసుకోవడం? మనకు వెంటనే వొగ ఆలోచనొచ్చింది. ఆలోచన రావడమేంది, మనం సెయ్యకపోవడమేంది, ఏమన్నా అర్థముండాదా? మట్టిని కుప్పగా తోసినా. కుప్పగాతోసి, దాని మధ్యలో నీటిబుగ్గ పుట్టించినా. మల్లేంజరిగిందో నాకెరిక దేవునికెరిక. మా ఇంట్లోవాళ్లగ్గూడా యెరిక. ఊళ్లోవాళ్లందరికీ యెరికైపోయింది[23]. కనబణ్ణోళ్లంతా అడగేపనే - "ఏం కదరయ్యా గువ్వెట్టుండాది? నొప్పి తగ్గిపొయ్యింద్యా?". అడగరా మడే! ఒకరోజా రెండ్రోజులా వారంపాటు. ఒంటికిబొయ్యాలంటే ఒక బాధగాదులే. తాతముత్తాతలంతా - "వినువీధిని శ్రేణులుగా నిల్చి విడ్డూరముగా చూచెదరా!" అంటే సూడరా!?
ఆట్లాడితే దెబ్బలు తగలకండా వుంటాయా? పైగా కొత్తకొత్త ఆటలు కనిపెట్టిమరీ ఆడతామాయె. రాళ్లాట (రాళ్లను కొట్టేది ఒకటి, రాళ్లతో కొట్టుకునేది ఒకటి). యీపులచెండు (పుట్టచెండుతో వీపులు పగలగొట్టుకునే ఆట), జిల్లాకోడి ఎప్పుటికైనా కండ్లు పోగొట్టేదే. బలుగూడు ముక్కూమొగమూ కాళ్లూజేతులూ యేమైనా దెబ్బదినొచ్చు. బస్సాట - ఇటుకలు బస్సులుగాజేసి మంటిలో రోడ్డేసి ఆడుకునే ఆట. ఈ ఆటలో బస్సులు గుద్దుకోవొచ్చు, కొద్దిలో తప్పించుకోవొచ్చు, కొండలు యెక్కొచ్చు, డైవర్ల చేతివేళ్లు నుజ్జుగావొచ్చు, ఇంగో డైవరుకు కోపమొచ్చిందంటే బస్సు గాల్లోకి లేసినా లేవొచ్చు. నేలా-బండా ఆడితే కాళ్లు బొబ్బలెక్కొచ్చు. చింతకొమ్మలను చేత్తో పట్టుకోని యాలాడి, ఆ చేతుల మద్యలోగుండా కాళ్లనూ మిగతా వొళ్లునూ అట్లాయిట్లా పల్టీకొట్టించే ఆట, చేతులు జారితే తల పగలొచ్చు, యమకలు ఇరగొచ్చు.
******** ******** ********
మట్టిలోకి పోతేనే గుడ్డలు మాసిపోతాయని, ఎండకు తిరిగితేనే నల్లబడిపోతారనీ, గాలికితిగిరితేనే జుట్టు మాసిపోతుందని, యే కాలువల్లోగానీ బావుల్లోగానీ దిగితే యేమౌతుందోయేమో అని భయపడి, తమ పిల్లలను పంచభూతాలకు దూరంగా ప్రయోగశాలల్లో మొక్కలమాదిరిగా సుకుమారంగా పెంచే తల్లిదండ్రులను చూస్తే నాకు జాలి కలుగుతుంది. ఆ పిల్లలను చూస్తే బాధ కలుగుతుంది. చక్కగా తలదువ్వుకొని బట్టలు మాయకుండా కుదురుగా ఒకచోట కూర్చోవడమే మంచిపిల్లల లక్షణమని నూరిపోసి వారిని పంజంరంలోని పక్షుల్లాగ పెంచే తల్లిదండ్రులు ఎక్కువౌతున్నారేమో అనిపిస్తోంది.
ఇట్టాటివాటన్నింటికీ భయపడితే ఆ పిల్లకాయ పెద్దోడైనాక దేనికీ పనికిరాకుండాబోడా! కష్టమొచ్చినా, దెబ్బతగిలినా తట్టుకోవాలంటే చిన్నప్పుడే కొంచెమైనా ఆ అనుభవాలు శారీరకంగానూ, మానసికంగానూ అవసరంకాదా! "యిప్పుడున్న మనలో ఉన్న మడిసి ఇంగ రోంచేపటికి ల్యా!". ఉన్నట్టుంది ఇంట్లో ఒక మనిషి శాశ్వతంగా దూరమైపోతే తట్టుకొని నిలబడే మానసిక పరిణతి ఎట్లా వస్తుంది?
"సోకోర్చువాడె మనుజుడు" అన్నాడు సుమతీ శతక కర్త బద్దెన. సోకు అంటే ఎదురుదెబ్బ, పోటు, ఆంగ్లంలో బ్లో. ఆ దెబ్బ మానసికం కావచ్చు, శారీరకమూ కావచ్చు.
సుమతీశతకంలోని కంద పద్యం ఇదీ:
ఆకొన్న కూడె యమృతము,
తాకొంచక నిచ్చువాడె దాత ధరిత్రిన్,
సోకోర్చువాడె మనుజుడు,
తేకువ గలవాడె వంశ తిలకుడు సుమతీ!
అమృతమంటే ఏమిటో గాదు ఆకలిగొన్నపుడు తిన్న తిండే. తనసంగతి చూసుకోకుండా (!?) ఇచ్చేవాడినే దాత అంటారు ఈ భూమి మీద. బాధలకు, ఎదురుదెబ్బలకూ జీవితంలో ఆటుపోట్లకూ ఓర్చుకోగలవాడే మనిషి. తేకువ అంటే ధైర్యం.
******** ******** ********
నిలువుపల్టీలు, అడ్డపల్టీలు, యోగాసనాలు, ఎగరడాలు, దుమకడాలు, పడటాలు, లేవటాలు, దెబ్బలుతినటాలు, మాన్పుకోవటాలు, గాలి, మన్ను, ఎండ, వాన ... అన్నీ పుష్కలంగా రుచిచూసిన నా పసితనం ఇంత మధురమైనదని ఇక్కడ రాసుకునేవరకూ ఎప్పుడూ అనిపించలా.
******** ******** ********
కథను కొనసాగించడానికి మీ బ్రౌజరు Back బటను నొక్కండి
లేదా మీ కీబోర్డు మీదున్న Backspace మీటను నొక్కండి.
1. చిన్నగ కాస్తాయా?
2. బోయవాళ్ల వెంకటసామి
3. గుడకా = గూడా = కూడా
4. అర్థంపర్థం = అర్తం, పర్తం
5. మడే = మరే
6. దొబ్బుకోవడమనే మాటకు నెట్టుకోవడనే అర్థం మాత్రమే ఉంది రాయలసీమ మాటల్లో. కొన్ని ప్రాంతాల్లో నానార్థాలుండవచ్చు.
7. యిరుడ్డం = విరుద్ధం, విరోధం, మొండితనం, మూర్ఖత్వం
8. ఉడుకుబోస్సాంది = ఉక్క పోస్తూ ఉంది
9. వుమ్మదం = ఆర్థ్రత, గాలిలో తేమశాతం ఎక్కువవడం, humidity
10. బారాకట్టె = పాచికల ఆట
11. ఆసికాలు = హాస్యాలు
12. పైటేళ = పగలు మూడున్నర-నాలుగు గంటల వేళ
13. చేండ్లంబడీ = చేనుల వెంబడీ
14. మెట్లు = చెప్పులు
15. ఎనుములు = బఱ్రెలు = గేదెలు
16. మంతిరిచ్చినట్టు = మంత్రించినట్లు
17. మోర = గొంతు పై భాగం, కిందిదవడ, ముక్కులు కలసి మోర
18. ముంచినంచేపూ = ముంచినంతసేపూ
19. జాచ్చి = జాస్తి
20. జిల్లాకోడి = జిల్లాకట్టె = గిల్లీదండ = బిళ్లంగోడు
21. బలుగూడు = చెడుగుడు = కబడ్డీ
22. వొట్టొట్టి మిరక్కాయ = ఆటలో అరటిపండు
23. యెరిక = ఎరుక

కామెంట్లు
అన్నట్టు రైసు మిల్లు వెనక గ్రౌండ్లో చెప్పులిప్పి క్రికెట్ ఆడినప్పుడు గుచ్చుకున్న తుమ్మముల్లు సగంలోపలే ఉండిపోయినా, తేలుకుట్టిన దొంగలా ఇంట్లో చెప్పకుండా అలాగే పడుక్కోడం, మర్నాటికి కాలు కిందపెట్టలేకపోడం ఇవన్నీ గుర్తొచ్చాయి నాకు.
http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B1%8A%E0%B0%82%E0%B0%97%E0%B0%BF%E0%B0%AE%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B3
మీ బాల్యం కథలతో నన్ను బాల్యంలోకి లాగేస్తున్నారే!
మీ కథలు నామిని వారి మిట్టూరోడి కథలకు ధీటుగా వుంటున్నాయి.
--ప్రసాద్
http://blog.charasala.com
శ్రీరామ్: ఔను. ఐఐటీ ఫౌండేషన్ వేసే ఆత్రుతలో అసలు ఫౌండేషన్ బలహీనం కాకుండా జాగ్రత్తపడాలనేది నా అభిప్రాయం కూడా.
రవి: వొంగిమళ్ల పేజీ సృష్టించింది నేనేకదా! ఆ గ్రామం నుంచీ వచ్చిన విద్యావంతులైన యువకులతో అందులో ఏమైనా రాయండయ్యా అని చెప్పాను. వాళ్లకు తీరినట్టులేదు.
ప్రవీణ్: అవును. (నువ్వు చెప్పిన ఆ చివరివాక్యం సరిగా అర్థంకాలేదు.)
ప్రసాదుగారు, చాలా ఆనందంగా ఉంది. అయితే ఈ టపాలోని భాష మరీ వ్యావహారికం అయిపోయి అర్థంకాకుండా ఉందేమో అని సందేహం కలుగుతోంది. మాడలికం మాటలను ఎట్లా మాట్లాడేది అట్టాగే కల్తీలేకుండా రాయాలని ఉందికానీ, అది చదివేవారికి అసలు అర్థంకాకపోతే లాభంలేదుకదా అని సంకోచిస్తున్నాను. ప్రయోగాత్మంకంగా ఈ టపాలో మాండలికపు చిక్కదనం కాస్త ఎక్కువచేశాను. నాగరికులుగా చెప్పబడే పట్టణవాసులకు మింగుడుపడనివి కాస్త వెగటుగా అనిపించే ఒకటిరెండు సంఘటనలుకూడా ఇందులో కలిపాను. చూడాలి 'చదువరు'ల 'స్పందన' ఎలా ఉంటుందో.
అందుకనో ఏమో నాకు అచ్చ పల్లె బాషలో వున్న ఈ కథలు నచ్చుతున్నాయి. లేదా నా నేపద్యం పల్లెటూరు అయినందువల్లా కావచ్చు.
వెగటుగా అనిపించే సంఘటనలూ వుండాల్సిందే. నిజానికి అవి మన పల్లెల్లో సర్వసాధారణం. "తీసుకురా" అనడానికి మన పల్లెల్లో "దెం*రా" అనడం మామూలు విశయం. అందులూ పట్టణవాసులకు బూతు కనిపించినా వాడుతున్న వారికి అందులో బూతు వుందనే విశయమే తెలియదు.
మిట్టూరోడి కథల్లో అయితే నాగరీకులకు ఇంకా జుగుప్స కలిగించే పదాలు బోలెడన్ని వున్నాయి. అయితే అలాంటి పద వాడకం వల్లే అది పల్లె జీవితాన్ని అద్దంలో చూపించినట్లుగా వుంది. "ఒసే లంజి ముండా" "ఒరే నా బట్టా" అనడాలు ప్రతిపేజీలోనూ కనిపిస్తాయి.
ఈ యాస అర్థం అయ్యేవారికి ఇందులోని మకరందం అందుతుంది. అర్థం కాని వారికి ఎలాగూ కాదు. వాళ్ళ కోసం ఎలాగోఊ బోలెడన్ని కథలున్నాయి. మీలోని ఈ కళను వీలయినంత స్వచ్చంగా వుంచండి. కొందరికి అర్థం కాదేమో అన్న సంకోచంతో దాన్ని పల్చన చేయొద్దు. ఇది నా అభిప్రాయం.
--ప్రసాద్
http://blog.charasala.com
పైన చరసాల వారన్న మాటలు అక్షర సత్యాలు. బూతేమో, అర్థం కాదేమో అన్న సంశయాలు విడిచి సజీవమైన భాషనే రాయి. మరీ జనాలకి అర్థం కాదనిపిస్తే ఈ మాట కథలో పెట్టినట్టు ఫుట్ నోట్సులో, ఈ కథలో పెట్టినట్టు కుండలీకరణాల్లోనో వివరణ ఇవ్వొచ్చు.
ఈ సాఫ్టువేరు చూడగలరు - http://www.blurb.com/
రాధికగారు, తేనెలో చిక్కిన చీమలాగా అయిపోయింది నా పరిస్థితి, మీ మాటతో. :)
శ్రీ హ్యాపీగారికి: ;-) ఎవరైనా ఏమైనా రాసినా చేసినా వాళ్లకు ఇంట్లో తప్ప మిగతా అన్నిచోట్లా మర్యాద జరగడం లోకరీతి. మామూలుగా ఇంట్లో ఎవ్వరూ పట్టించుకోరు. ఇంటగెలిపించి రచ్చగెలిచే అవకాశాన్ని నాకు కలిగించినందుకు థాంకులు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.