ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

అక్టోబర్, 2006లోని పోస్ట్‌లను చూపుతోంది

దీపావళి - చివరికి మిగిల్చేది

నాకు తొమ్మిదేళ్లప్పుడు ఒక దీపావళి పండగొచ్చింది. పటాకుల రేట్లు జాస్తి ఐపొయినాయని పల్లెలో పెద్దోళ్లంతా అనుకొంటాండారు. "ఈసారేంకొనబళ్లా" అంటున్నారు నిష్ఠూరంగా. "మ్మా...పటాకులకు లెక్కగావాల" అని అమ్మనడిగితే "నాదగ్గిర్లేదు నాయనా, మీ నాయన్నడుగుపోండి" అని సమాధానం. నాయన్నడగడానికి యాడికోబోవాల్సిన పన్లేదు పక్కన్నే వుండాడు. అడగాల్సిన పనీలేదూ, నేనడిగింది యింటానే వుండాడు. కానీ అట్టమల్లుకోని యెనిక్కి చేతులుగట్టుకోని నీలుక్కోన్నిలబడి మెడ పైకెత్తి పెంకుటింటి వసారాకిందనించీ ఆకాశంలో మోడాలుజూచ్చాండాడు. వాతావరణం ఏంబాలేదు. ఐనాసరే, "నాయినా" మొండిగా పిల్చినా. "ఊఁ" నిలబడినకాణ్ణుంచి మెడగూడా తిప్పకండానే అన్నాగానీ మన పని జరుగుతుందనిపించి, "లెక్కగావాల". "దేనికి?" మా గోపీ నా పక్కనే వున్నాడు. వాడు నోరెత్తడంలా. సపోర్టు ఇవ్వకండా డబ్బిస్తే పటాకులుమాత్రం కొనుక్కుంటాడని నాకు వానిమింద ఉక్రోషం. "పటాకులకు" "అయ్యి కొని వాటిని కాల్చడమెందుకు, లెక్క గావాలంటే యిస్తా, తీస్కబొయి పొయ్యిలోబెట్టు, కాలిపోతుంది, పండగైపోతుంది" నా మెహం మాడిపోయింది ఈ

అనువుగాని చోట అధికులమనరాదు

వీరసేనుని పాలన అజేయంగా సాగుతోంది. అనుకూలురైన అధికారగణం. క్రమశిక్షణతో మెలిగే ప్రజ. శాంతిభద్రతల సమస్యలేమీ లేవు. దేవతలు కూడా అతని పాలన మెచ్చారు. అగ్ని దేవుడు రాజ్యప్రజల్ని బాధించలేదు. వరుణుడూ వాయుదేవుడు సఖ్యతతో ఆ రాజ్యాన్ని సస్యశ్యామలం, సుభిక్షం చేశారు. వీరసేనుని ప్రతాపాగ్నికి ఎదురు నిలిచే సాహసులెవ్వరూ సరిహద్దుల ఆవల కూడా లేరు. ***** "ఇంతకూ యెవుర్నాయినా ఈ యీరసేనుడు ? రాజ్యమేందీ... యేందికత?" యెవురి పేర్జెప్తే బట్టుపల్లెలో పెద్దోళ్లంతా మామూలుగా "శివనారాయణరెడ్డి మనవడా...అట్టజెప్తేగదా..." అని దీర్ఘాల్దీస్తారో, యెవురి పేర్జెప్తే మిగతా జనాలు కొంచేపు ఆగి, " ఓ.. కాదరయ్యా! ఆపిల్లకాయకు యింగో పేరు గుడకా వుండాదాఁ?" అని వాపోతారో, ఎవడు పీలగొంతుతో గాఠ్టిగా "స్కూల్ అటెన్షన్" అని అరిస్తే శ్రీనివాసకాన్వెటు మొత్తం ఒక్కసారిగా సావధానమౌతుందో...... వాడే నేను. శ్రీ శ్రీనివాసకాన్వెట్లో ఐదోతరగతి చదివేనాటి మాటన్నమాట. పాఠశాల విద్యార్ధి నాయకుడనే పదవి వెలగబెట్టేవాణ్ణప్పుడు. ***** ఆ సంవత్సరం యండాకాలం వేడి చానా జాస్తిగా వుండడంతో, మద్యానంపూట లంచ్ బ్రేక్ లో పిల్లోళ్లెవరూ బయిటి