ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

జులై, 2008లోని పోస్ట్‌లను చూపుతోంది

అంతా వానిష్టమేనా అని!

"దేవుడు బలే నాయాలు. కద మా!?" అంటిన్నేను. దీగూటికి ఎదురుగ్గా నిలబడి దీపానికి దణ్ణం బెట్టుకుంటాన్నింది మా అమ్మ. కండ్లు దెరిసి గోడకు తగిలిచ్చిన దేవుని పటాలకల్లా చూసి యివతలి కొచ్చేసింది గానీ, యేం మాట్లాళ్లా. ఇంట్లో ఎవురి మింద కోపమొచ్చినా, "ఈ పాపిష్టి దేవుడు నన్నింగా తీసకపోలేదే" అనే మా అవ్వ గూడా ఏమీ అన్లా. ****************************************** కతేందంటే ... మా బూదకోడిపెట్ట పద్నాలుగు గుడ్లు బెట్టింది. గుడ్లుబెట్టడం దానికిదే మొదులు. గంపలో ఇసక బోసి, వరిగెడ్డి పేర్చి, పిడుదులూ గోమారీ పట్టకండా గబ్బుమందు చల్లి దాన్ని పొదగ బెడితిమి. అది గూడా శర్దగా పొదిగింది. వొగ రోజు సందేళ నాలుగు గుడ్లు పిగిలినాయి. తెల్లారుఝామున మంచం దిగి చూస్తే ఒకటి తప్ప మిగిలిన గుడ్లన్నీ పిగిలి పిల్లలైనాయి. ఆ మిగిలింది మురుగుడ్డు కాగూడదురా దేవుడా అనుకుంటా వుండాం. తెల్లారి పొద్దెక్కేటప్పుటికి ఆ గుడ్డులో వుండే పిల్ల ముక్కుతో పొడిసి బొక్కబెట్టింది. మిగతా పని బూదకోడి చేసేసింది. ఒక్క గుడ్డు గూడా వోటు పోనీకండా వుండే కోడిపెట్ట అందరికీ వుండదు గదా. రెండోరోజు పిల్లలన్నిట్నీ యెంటేస్కోని ఇంట్లోనుంచి మొదుటి సారి బైట