ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

నవంబర్, 2007లోని పోస్ట్‌లను చూపుతోంది

ఏ తీరుగ నిను నువు జూసెదవో ... !!

చింతచెట్టుకింద గోలీలాట ఆడుకుంటాండాం. మొదిటాట మా దిక్కు ఓడిపొయినాం. చానూవాళ్ల దిక్కు గెల్సినారు. గోలీలాటలో చానూను కొట్టేవోడు బాదుల్లా వొక్కడే. గెలిచిన దిక్కు వుండే వోళ్లు వొగోరూ మా గోలీని యంత దూరం కొడితే అంతదూరం నుంచీ ఓడిపొయినోళ్లము మోచేత్తో బద్దె దాఁక దేకాల గదా. నా దెగ్గిర ఒక గుబ్బగోలీ వుంటే దాన్నిచ్చినా కొట్టుకోండి సూజ్జామని. గుబ్బగోలీని కదిలిచ్చడం అంత సులువుగాదు. కదిలిచ్చినా మోచెయ్యి దోక్కపోకండా బద్ది దాఁక దేక్కరావొచ్చని నా ఆలాశన. అవతల మా గోపీగాడు వుండాడు గదా! వాని దెగ్గిర అంతకంటే పెద్ద గోలిగుండు వుంది. వాడు దాన్ని చానూకిచ్చినాడు. పెద్దగోలీతో కొడ్తే గుబ్బగోలీ ఎగిరి యాణ్ణోబొయ్యి పడె. ఆ తరవాత చానూదిక్కోళ్లు ఎవురూ దాన్ని కదిలిచ్చల్యాక పొయిరి. ఇంగ దేకేటప్పుడు గెల్చినోళ్ల ఊలలూ కేకలూ. మా దిక్కు బాదుల్లా వొక్కడే సరైన ఆటగాడు. మిగతావాళ్లము సరిగ్గా ఆడల్యాకనే ఓడిపొయినాం. ఐనాసరే నన్ను వద్దనిజెప్పి బాదుల్లా వొగడే గోలీని మోచెత్తో బద్దిలోకి దొల్లిచ్చిపారేశ. *** *** *** *** *** *** *** *** జిల్లాకోడైతే జిల్లను ఎరగేసి మూడేట్లు నాలుగేట్లు కొట్టేసి నేనొక్కణ్ణే గెలిపించిపారేస్తాగానీ గోలీ