ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

సెప్టెంబర్, 2006లోని పోస్ట్‌లను చూపుతోంది

కంచు - కనకము - మంచి - చెడ్డ

శ్రీ శ్రీనివాస కాన్వెంట్లో నేను ఐదోతరగతి చదివేనాటి సంగతి. మా తరగతి గది కాన్వెంటు ఉత్తరద్వారానికి ఆనుకొని వుండేది. ఉత్తరద్వారం ఎదురుగా రోడ్డవతలున్న ఇంట్లో వీరబల్లె హైస్కూల్లో పన్జేసే టీచరొకాయనుండేవాడు. [రెండేళ్లక్రితమే ఈ హైస్కూలు జూ.కాలేజీ అయింది] ఆయనకు నాకంటే సుమారుగా పెద్దయిన ఇద్దరో ముగ్గురో కూతుళ్లు. నా ఐదోతరగతి మిత్రులంతా నాకంటే వయసులో కనీసం ఒక సంవత్సరం పెద్ద. *** *** *** ఎందుకంటే ... ఇదీ సంగతి: చింతచెట్టుకింద ఇసక. ఇసకమీద గాడ్రేజి కుర్చీ. కుర్చీలో నాగన్నసారు. నాగన్నసారు చేతిలో ఈతబర్ర [లేక ఈతబెత్తం]. ఆ బర్ర దెబ్బ తగలడానికి అనువైనంత దూరంలో నాగన్నసారు చుట్టూతా పిల్లకాయలు. ఈ రంగస్థల అధికార నామము: జిల్లా ప్రాథమిక పాఠశాల, భట్టుపల్లె గ్రా., వీరబల్లె మం. నా నాలుగో ఏటనే నా పాత్ర ఈ రంగస్థలప్రవేశం గావించబడింది. సాధారణంగా ఐదేళ్లు నిండిన పిల్లలను బళ్లో చేర్చేవాళ్లపుడు. *** *** *** శ్రీ శ్రీనివాస కాన్వెంట్లో నేను ఐదోతరగతి చదివేనాటి సంగతికి వస్తే... మనమే క్లాస్ ఫస్టు. మనమే క్లాస్ లీడరు. మనమే మాస్టర్లకు మేడంలకూ ప్రియశిష్యుడు. నాలుగో తరగతిలో నాకంటే మంచిమార్కులు తెచ్చుకొనే యిద్దురు పిల్లోళ్లు ఆ