ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

నవంబర్, 2006లోని పోస్ట్‌లను చూపుతోంది

ఎవ్వరికోసం నీ మందహాసం

ముక్కావారి పల్లెలోని ఆంధ్రప్రదేశ్ బాలుర గురుకుల పాఠశాలలో చదవడానికి స్ధానం సంపాదించడం నా యీడు పిల్లకాయల్లో ఒక గొప్ప. ఎనిమిదో తరగతిలోకి నా ప్రవేశం. నేను మొట్టమొదటిసారిగా అమ్మానాయనలను వొదిలి దూరంగా స్కూలుహాస్టల్లో కొత్తగా చేరిన రోజు. మా వూరినుంచి ఆ బడికి ఎంపికైన ఇంకో పిల్లకాయ నారాయణ. మాకంటే రెండేంఢ్ల ముందు ఎంపికైన మావూరి యీర్నాగయ్య అక్కడ పదోతరగతి. బళ్లో చేరిపించినాంక మానాయనా నారాయణోళ్లనాయనా రాయచోటి బస్సెక్కి 'భద్రంగా ఉండండి' అన్జెప్తాండంగానే బస్సుకదిలిపాయ. అది కనబణ్ణందూరమూ చూస్తానే వుంటిమి. మెదడులో ఆలోచనలేమీ లేకండా ఖాళీ ఐపోయినట్టుంది నాకు. బళ్లోకి మెల్లిగా నడిచినాం. అదే ఆఖరిసారి మేం స్కూలు ప్రహరీని అనుమతిలేకుండా దాటి కడప-తిరుపతి రహదారి మీదకు అంత స్వేచ్చగా వెళ్లి నింపాదిగా రావడం. హాయిగా మన పనులన్నీ అమ్మానాయన చేస్తావుంటే సుఖంగా మంచి పప్పు నెయ్యి పెరుగు తింటూ పెరిగిన సౌకుమార్యానికిది పూర్తి విరుద్ధం. చిన్నచిన్న పొరబాట్లు చేస్తే 'పిచ్చినాయనా' అని మురిసిపోతూ సరిచేసి సాయంచేసే అవ్వ వుండదు. మార్గం కఠినం. ఇక్కడంతే. 'అయ్యో నాయనా దెబ్బ తగిలిందా' అనే ఓదార్పు మాటలిక్కడలేవు. దె