ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

జూన్, 2007లోని పోస్ట్‌లను చూపుతోంది

ఆకొన్నకూడు - సోకోర్చువాడు

" బట్టుపల్లె లో యండలు యేమి సిన్నగ్గాచ్చాయా!" [1] అంటా మేకలమందను దొడ్లోకి తోల్తాడు బోయోళ్లెంగటసామిఁ! [2] ఆ మాట నా చెవులబడఁగానే శ్రీకృష్ణదేవరాయలు అప్పుడెప్పుడో జెప్పినమాట గుర్తుకొస్సాది. "దేశభాషలందు తెలుగు లెస్స" అన్న్యాడంటే ఊరికే అన్న్యాడా? రాయలవారికి తెలుగు, సంస్కృతమ్, కన్నడ, తుళు, ... ఇట్టా దేశంలో ఉండే నానా బాసలన్నీ తెలుసుగాబట్టి, తిరిగి సూసినాడు గాబట్టి ఆమాట అనగలిగినాడంట. మా యంగటసామిఁగుడకా [3] అంతే. యంగటసామిఁకి బట్టుపల్లె, బాలగ్గారిపల్లె, బాలసానోళ్లపల్లె, ఈరబల్లె, ఈడిగపల్లె, గుఱ్ఱప్పగారిపల్లె, తురకపల్లె, తూరుబ్బల్లె, పాలెంపలము, పోలోళ్లపల్లె, ... ఇట్టా దేశంలో ఉండే నానా ఊళ్లన్నీ తెలుసుగాబట్టి, తిరిగి సూసినాడుగాబట్టి ఆ మడిసి మాటకు వొగ యిలువ. "బట్టుపల్లెలో యండలు యేమి సిన్నగ్గాచ్చాయా!" అన్న్యాడంటే ఊరికే అన్న్యాడా? వొగ అర్తముండాది. వొగ పర్తం [4] గూడా ఉండాదిమడే [5] . పొద్దు బారడన్నా పైకెక్కందే మ్యాకలు నీళ్లకోసరం తావటిచ్చి మేత సాలిచ్చి వొగదాన్నొగటి తోసుకుంటా దొబ్బుకుంటా [6] ఇంటిదోవబడ్తే యెవురికైనా బాదేగదా! బట్టుపల్లెలో యండలేం సిన్నగ్గాచ్చాయా!? "యేమబ