ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ఆగస్టు, 2007లోని పోస్ట్‌లను చూపుతోంది

నాలుగు నల్లలారీలు - ఆరు యర్రలారీలు

తోటలోకి లారీ వొచ్చింది. మా(మి)డికాయల కాలంలో తప్ప మా ఊళ్లో లారీ అనేటిది కనపరాదు. మాడికాయలు తప్పితే లారీల్లో మోసకపొయ్యేంత పంట ఈరబల్లె మండలంలో ఇంగోటి లేదు. చెనిక్కాయలుగానీ ఒడ్లుగానీ పొద్దుతిరుగుడు గింజలుగానీ ట్రాక్టరుతొట్టి నిండితే గొప్పసంగతి. తోటలన్నీ ఎక్కువగా రైతులవి. కొనేటోళ్లు ఎక్కువగా సాయిబూలు. మాడితోటల్లోకి లారీ వొచ్చిందంటే పీర్లపండగ మెరవణి మాదిరిగా ఉంటాదనుకో. అందరికీ లారీని దెగ్గిర నుంచీ సూడాలనుంటాది. పనిబడి పిలిస్తే పలక్కండా బొయ్యేటోళ్లంతా లారీ వచ్చిందంటే పాలెగాళ్లైపోతారు. ఈ కొత్త పాలెగాళ్ల పెత్తనం ఎవురి మిందనో గాదు, ఊరి పిల్లకాయల మిందనే. ఒగటే అదిలింపులు... "రేయ్ దూరంగాబోండ్రా, టైర్లకింద బణ్ణారంటే పిసురైపోతారు, పడ్తే మల్లేం ల్యా నా కొడకల్లాలా, రేయ్ గుండునాయాలా, రోయ్, ఓరి గుండోడా, ఏమిరా నాయాండ్లాలా సజ్జామని వచ్చినారేమిరా, పోండిదూరంగా, ..." తోటగల్ల పెద్దమనిషి గనక దగ్గర్లో ఉన్యాడంటే పెత్తనం పెద్దరికంగా మారిపోతుంది - "సూడున్నా పిల్లనాకొడుకులు చెబితే యింటాండారేమో, మన తోటకాడ ఏమన్నా అయితే మనకేగదా మచ్చ, యీళ్ల నాయనగార్లకు జవాబు జెప్పేదెవురు, ...". కాయలన్నీ లారీకి ల