ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ఆగస్టు, 2008లోని పోస్ట్‌లను చూపుతోంది

'పాప' పరిహారము!?

ఆ సాలు దీపావళికి మా అత్తమ్మలిద్దర్నీ మా యింటికి పిలిచినాం. బట్టుపల్లెలో కరమలోళ్లూ కంసలోళ్లూ మంగలోళ్లూ సాకలోళ్లూ యీడిగోళ్లూ బెస్తోళ్లూ అందురూ గూడా వాళ్ల వాళ్ల ఆడబిడ్డలను పిలిపిచ్చుకున్యారు. పెండ్లిండ్లయ్యి అత్తగార్లింటికి పోయిన ఈ ఆడబిడ్డలందరికీ పండగలకు అమ్మగారింటికి రావడం, చిన్నప్పటి నుంచి వొకే చోట పెరిగినోళ్లు కాబట్టి వొకరినొకరు పలకరించుకోవడం సంబరమే అయినా, పెండ్లయినపుడు వాళ్లు వొదిలిచ్చుకున్న దరిద్రమొకటి పల్లెకొచ్చినపుడు మల్లా వాళ్లకు చుట్టుకుంటుంది. మా పల్లెకు కాపురానికొచ్చిన ఆడోళ్లకైతే మాత్రం అది తాళిబొట్టు కన్నా గట్టిగా చుట్టుకుంటుంది. ***** ***** ***** ***** ఒళ్లుగ్గానీ వంటగ్గానీ మంచిగ్గానీ చెడ్డగ్గానీ నీళ్లు గావాలంటే మాకుండే ఆధారం మంచినీళ్ల చేద బాయి వొక్కటే. మంచి భద్రమైన రాతి కట్టుడున్న ఆ చేద బాయి దరికి ముందర అర్ధచంద్రాకారంలో BHATTU PALLE అనే అక్షరాల కింద 1934 అని చెక్కివుండే రాతి పలక వుంటుంది. మా ఇంటికి తూరూగా పెద్దచేను, అసాన్ చేను దాటినాఁక, చెఱువు కాలవకు అవతల వుండే ఈ బాయి కాడ -- పండగలప్పుడూ యండాకాలంలోనూ బిందెలు, కడవలు, అండాలు వరస కట్టి కనబడతాయి. పొద్దన్నే చాంతాడ