ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

సెప్టెంబర్, 2009లోని పోస్ట్‌లను చూపుతోంది

పేరు గలవాడేను మనిషోయ్

పదహారు నెలల క్రితం ఈ రచనను అందంగా ముస్తాబుచేసి ప్రచురించినందుకు ఈమాటవారికి కృతజ్ఞతలు. కొత్తపాళీ బ్లాగులో ఇచ్చిన ఇతివృత్తానికి కథ రాయండి అనే సవాలుకి జావాబుగా వచ్చిన కథ ఇది. యండాకాలానికీ వానాకాలానికీ మధ్యలో ఒక రోజు రాత్రి. గాలి తోలటం లేదు. చూరు కింది అరుగుపై బొంత పరుచుకొని పడుకుని వున్నాడు బుట్టోడు. వాని నాయన శివుడు కొట్టంలో సంగటి తింటూ వున్నాడు. ఆ ఇంట్లో వాళ్లిద్దరే. ఆపొద్దు వాళ్లింట్లో సియ్యలకూర. రెడ్డేరి ఇంట్లో మాంచి గుడ్లకోడిపెట్ట. రోగం తగిలి ఆ రోజే తూగి చచ్చింది. చచ్చిన కోడిని రెడ్డేరు తినరు. తోటకు కావలి కాస్తూ ఇతర పనులు చూసుకునే శివునికి ఇచ్చారు. దాన్ని కోసి కూరజేసి, రెడ్డేరింటికాడ రెండుముద్దల సంగటి అడిగిపెట్టించుకొని, వస్తూవస్తూ రెండు పాకెట్ల సారాయి కూడా తెచ్చుకొని పండగ జేసుకుంటున్నాడు శివుడు. గుండెకాయ, గుడ్డుసొన లాంటి మెత్తనివన్నీ బుట్టోనికి తినిపించి, ఎముకలను కూడా మిగలనీయకుండా జుర్రేస్తున్నాడు. వాళ్ల నాయన అట్టా తింటూవుంటే బుట్టోనికి భలే సంబరం. పైన చుక్కలను చూస్తూ ఇంట్లో నుంచీ వచ్చే శబ్దాలను ఆనందంగా వింటున్నాడు. సియ్యలకూర తిన్నప్పుడు మాత్

అమెరికాలో కరంటు పోయింది

ఎప్పుటిమాదిరిగా సిన్నప్పుటి సంగతి కాకుండా, ఈ నెల్లో రోంత యేరేగా సిన్న కతట్టాడిది చెబ్దామని... ఆదివారం. సాయంత్రం ఆరున్నరయింది. ఇల్లంతా శుభ్రం చేసి, షవరు కింద తలస్నానం చేసి ఫ్యాను కింద నిలబడినాడు సోమూ. ఫ్యాన్ గాలికి జుట్టు తడియార్చుకొంటూ అలసటలో హాయిని అనుభవిస్తున్నాడు. అతని పారవశ్యాన్ని భగ్నం చేస్తూ ఇంటిబయట ఢాంమ్మని శబ్దం. కిటికీవైపు చూశాడు. కళ్లు మిరుమిట్లుగొలుపుతూ మెరుపులు. వాటి వెంబడి, దిక్కులు పిక్కటిల్లజేస్తూ ఉరుములు. పడగ్గదిలోని విద్యుద్దీపం కన్నుకొట్టింది. ఫ్యాను కూడా ఒక క్షణం ఆగి మళ్లీ వేగమందుకొంది. గబగబా చల్లాడమూ చొక్కా తొడుక్కున్నాడు. బయట జోరుగా వర్షం కురుస్తున్న శబ్దం. విసురుగా గాలివీచింది. పెద్దపెద్ద చినుకులు కిటికీని దబదబా బాదుతున్నాయి. ఉన్నట్టుండి కళ్లముందు చీకటి. ఫ్యాను తిరగడం ఆగిపోతున్న చప్పుడు. తాళాలూ, జేబువాణి(mobilePhone), చేజోలె( wallet ) తీసుకున్నాడు. వర్షాన్ని చూద్దామని బయటికెళ్లాడు సోమూ. భీకరంగా వుంది వాతావరణం. 'ఈ అమెరికాలో ఏమొచ్చినా భారీగానే వుంటుంది' అనుకున్నాడు. అరగంట గడిచింది. వర్షం ఇప్పట్లో ఆగేలా లేదు. ఇంట్లోకి వెళ్లాలంటే లోపల ఉక్కపోత. హరికేన్