ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

జనవరి, 2008లోని పోస్ట్‌లను చూపుతోంది

పదుగురాడు వేట ...

సంకురేత్రికి సలి సంకల్లో వుంటాదంట - శివరాత్రికి శివశివా అంటాదంట. బట్టుపల్లెలో బడిపిల్లకాయలంతా దీన్నొగ పాట మాదిరిగా పాడతాంటారు. సలిమంటలకాడ ముసిలోళ్లు గూడా ఆ మాటే అనుకుంటాంటే యిన్న్యా. అందురూ పొద్దన్నే లేసి సలిమంటేస్కుండే దానికోసం రేతిరిపూటే పుల్లలూ కంపలూ యేరుకొని దాసిపెట్టుకుంటారు. మాకు మాత్రం రేతిరి తెల్లారిందాఁక మా సింతసెట్టు రాల్చిన పుల్లలే సరిపోతాయ్. సరిపోకపోతే కావలసిన్ని కందిపుల్లలుండాయి. వొరిగడ్డి గూడా వుందిగానీ, అది మండుకున్నంత సేపు కూడా కాలకుండా ఆరిపోతాదని దాన్ని కాల్చితే పెద్దోళ్లు తిడతారు. మంచోనికి కోపమొస్తే అది వొరిగడ్డి మండినంత సేపుగూడా వుండదని పెద్దోళ్లు పద్యం గూడా చెప్తా వుంటారు. ఆ మంటలో రాళ్లేసి, అయ్యి యర్రఁగ కాలినాఁక అప్పటిదాక బిగబట్టుకున్నోళ్లం వాటిని సుర్రుమనిపిచ్చినామంటే... ఆడికి ఆ పూట సలిమంట ముగిసినట్టు. కొన్ని రాళ్లైతే ఫట్టుమని పగులుతాయి. "ఎందుకురా ఆ సలికి వొణుకుతా పుల్లలేరడం, ఆ పుల్లలు మంచుకు తడిసి మండకపోవడం, వాటికి మంటబెట్టేదానికి కొటానికుండే బోదపీసు పీకడం, ఇంతాజేసి మండితే ముందుకు కుచ్చుంటే యీపున సలి, యీపుకు సలిగాసుకుంటే పొట్టలో సలి, పుల్లలు అయిపోంగానే మల్లా