ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ఫిబ్రవరి, 2009లోని పోస్ట్‌లను చూపుతోంది

వసన్ తోళ్లపల్లె మాట

మా అవ్వోళ్ల అమ్మగారివూరు వసంతవాండ్లపల్లె. ఆ వూరేమన్నా పాడిపంటల్తో తులతూగుతా వుంటాదా అంటే, ఏమీ లేదు. వాళ్లంతా బాగా లెక్కలున్నోళ్లా? ల్యాపోతే తిని బలిసినోళ్లా అంటే అదీగాదు. అందురూ అంతంతమాత్రం మణుసులే. ఆ పల్లెలో యేమున్న్యా ల్యాకన్న్యా కుశాలమాటలు మాత్రం యాడజూసినా యినబడతాంటాయ్. ఇద్దురు మణుసులు ఎదురుపణ్ణారంటేసాలు, రెండు యెగతాళి మాటలైనా రాలాల్సిందే. వరసైన ఆడమనిసి పోతాందంటే ఏదోఒకటి అనకండా పోనీరు. ఆ మనిసిమాత్రం? యాడ తగలాల్నో ఆడ తగిలేటిగా జవాబు చెప్పకండాబోదు. ఇయ్యన్నీ నాకెట్టదెలుసు అంటే, సెలవుల్లో నేనా వూరికి పోతాగదా! ఎవురితోట పోతా? మా సిన్నాయనతోట. మా సిన్నాయనంటే మా అక్కులవ్వ కొడుకు. అక్కులవ్వంటే మా నాయనమ్మకు సొంత అక్క. మా సిన్నాయనోళ్లుండేది మూలపల్లెలో. మూలపల్లెలో ఈ మూల కేకబెడితే వసంతవాండ్లపల్లెలో ఆ మూలకు బ్రమ్మాండంగా యినబడతాది. రెండుపల్లెలకూ మధ్యలో వొగ బండ్లబాట అడ్డమంతే. నేను వసంతోళ్లపల్లె అంటాండాగానీ, మా సిన్నాయనైతే వసన్‌తోళ్లపల్లె అంటాడు. వాళ్ల మేనమామగారిని వసన్-తోళ్లు అంటాడు. ************* నాకు గుర్తులేదుగానీ, మా అక్కులవ్వచెప్పేది - ఒక మంచి ఆవుండేదంట. పొద్దున్నే దాని పొదుగుకడిగి పాలు పిండుతా