ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

జులై, 2009లోని పోస్ట్‌లను చూపుతోంది

జిమ్మీ అటాక్ - 1

కుక్కలకు పేర్లుంటాయని మాకప్పుడు తెలీదు. మేం బట్టుపల్లెలో వుండగా మాఇంట్లో ఒక కుక్క వుండేది. మా తాత మంచానికి బారడు దూరంలో కుచ్చోనుండేది. రోజుకు రెండుపూటలు దాని గిన్నెలో దానికి అన్నం. ఆయన తినేముందు దానికీ ఒక ముద్ద సంగటో అన్నమో పెట్టేవాడు. ఆ దారిన ఎవరు కదిలినా గుర్ర్‌ర్ మని బెదిరించేది. భలే కుక్క అనేవాళ్లు మా తాతతో పనిబడి వచ్చినోళ్లు. అది జాతికుక్కేమీ కాదు. ఊరకుక్కే సంతానమే. ఐతే దానిజాతిలో అది గొప్పదేనని మా తాత మోజుగా పెంచినాడు. మావాళ్లంతా మడికాడికి పోయినా, మా తాతపక్కనే వుండి ఇంటికి కావిలి కాసేది. కొన్నేండ్లు పొయినాయ్. ఒకసారి ఏదో రోగం తగిలి పల్లెలో శానా కుక్కలు సచ్చినాయ్. వాటితో పాటే మాదీ. దాని కతలు నాకేం గుర్తులేవు. మేము పల్లెనొదిలి మా సంతనానికి (సంత వనానికి) వొచ్చేసినాం. ఐదోతరగతిలో. ఇంటి సుట్టూరా మడి, మామిడిచెట్లూ, కాలవలూ కట్టలూ, గెడ్డీ గ్యాదం వుండటాన కోళ్లకూ గొడ్లకూ మంచి అనువు. బావురుపిల్లులకూ ముంగీసలకూ అనుకూలమే. కల్ల భద్రంగా వున్న్యాగాని దొంగగొడ్లు రాత్రిపూటొచ్చి మళ్లోఁబడి మేసిపొయ్యేటియి. అడివిపందులూ ఊరపందులూ కూడా వొచ్చి చెనిక్కాయలు లోడేటియ్యి. ఇంటి సుట్టూరా పురుగూ పుట్రా తిరుగుతా వు