ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

డిసెంబర్, 2008లోని పోస్ట్‌లను చూపుతోంది

కోదండరామాంజులు

మనిసన్న్యాక రోంత సున్నితముండాల. మొద్దుబారగూడదు. మనిషి మొద్దుబారితే ముందు వానికేనష్టము, మల్లనే మిగతాజనానికి నష్టము. ఎవురైనా యెందుకుమొద్దుబారతారు అంటే వొగ సిన్న కజ్జెప్తా. నేను మూడోతరగతివరకూ మా బట్టుపల్లెలో నాగన్నైవోరిబళ్లోనే సదువుకున్న్యిట్టు చెప్తిగదా. శ్రీ శ్రీనివాసాకాన్వెంట్లో నాలుగోతరగతిలో జేరేటప్పుటికి రోంత ఆలస్యమయింది. అప్పుటికే ఇరవైమూడుమంది పిల్లకాయలు చేరిపొయ్యుండారు. శానామంది వొకటోతరగతి నుంచి కాన్వెంట్లో సదివినోళ్లే. వోళ్ల పేర్లుగూడా ఏబీసీడీల ప్రకారమూ తిరగరాసి నంబర్లుగూడా ఇచ్చుండారు. రెడ్డొచ్చ మొదులుబెట్టు అనేమాట మా నాగన్నైవోరిబళ్లో చెల్లుబాటౌతుందేమోగానీ శ్రీశ్రీనివాసాకాన్వెంట్లో కాదుగాబట్టి "టొంటీఫో..ర్" అంటే "ప్రజెన్ మాస్టే" అని పలకాల. మేడమైతే "యస్ టీచే" అనాల. నాగన్నైవోరిబళ్లోమాదిరిగా చింతచెట్టుకింద ఇసకలోగాదు, బోదకొటంలో బండలమింద గంటలతరబడి మెదలకండా కుచ్చోవాల. ఆరంకణాల కొటంలో నాలుగోతరగతి ఒకపక్కకూ, ఐదోతరగతి ఇంగోపక్కా మల్లుకొని కూచ్చోవాల. రెండు తరగతులకూ మధ్యలో వుండే దూలానికి కోదండం యాలాడతాంటాది. కోదండ మంటే దూలానికి దండమాదిరిగా కట్టిన రెండుమూరల నులకతాడు