ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

అక్టోబర్, 2007లోని పోస్ట్‌లను చూపుతోంది

వేదికనలంకరించిన పెద్దలు

ఊరంతా జండాల పండగ. శ్రీ శ్రీనివాస కాన్వెట్లో ఆ పండగపేరు స్వాతంత్ర్య దినోత్సవము. అంతకు ముందు రెండు వారాల నుంచీ రోజూ సాయంత్రం పూట పీ.టీ.పిరుడు, మోరల్ పిరుడు కలిపేసి పిల్లకాయలందర్నీ వక కొటంలో చేర్చి మా అందరి చాతా దేశభక్తి గీతాలు పాడించి నేర్పించినారు. ఆగస్టు పదహైదోతేదీ పొద్దన్నే ప్రెయరు. ఐదోతరగతిలో క్లాసుఫస్టు కాబట్టి, నేనే యస్పీయల్ (స్కూల్ ప్యూప్‌ల్స్ లీడర్). ఐదో తరగతిలో నేను ఎందుకు క్లాసు ఫస్టు అంటే - అంతకు ముందు సమచ్చరం అంటే నాలుగోతరగతిలో నాకన్నా ఫస్టొచ్చే పిల్లకాయలంతా ఈ సమచ్చరం మా బళ్లో ల్యాకపోబట్టి. అది యేరేసంగతిలే. ******* ******* ******* పొద్దన్నే ప్రెయరు. ప్రెయర్లో ప్రతిజ్ఞ . "భారత దేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశమును ప్రేమించుచున్నాను. ... మ్... మ్..." ఢమాల్. ఆ తరువాతేందో ప్రతిజ్ఞ చదివేవానికి గుర్తుకు రాల్యా. మామూలుగా ఐతే మూడోతర్తి పిల్లోళ్లల్లో రోజుకొకరు ప్రతిజ్ఞ చెప్పాల. చెప్పలంటే అది కంఠోపాఠం రావాల. రాకపోతే బుక్కుజూసి చదవాల. తరవాత దెబ్బలు తినాల, యండలో నిలబడాల. జండాల పండగ రోజున ఇట్టాటి పంచాయితీ వుండగూడదని ప్రతిజ్ఞ గడగడా చెప్పేస