ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

జులై, 2007లోని పోస్ట్‌లను చూపుతోంది

పెద్దోళ్ల కోడిపుంజులాట

నాలుగేండ్లకే ఒకట్లో జేరిపించడంతో, మూడోతరగతి వయసుకే నాకు నాలుగోతర్తి పూర్తైంది. శలవలొచ్చాండాయనే మాట యినపరాంగానే చెవుల్లో తేనెబోసినట్టయింది. యండాకాలం సెలవలు. యాభై రోజులు బడీగిడీ ల్యా. నాబోటి పిల్లకాయలందరికీ అలివిగాని సంబరం. ఎందుకంటే, పొద్దుపొద్దన్నే బడిని గుర్తుజేసుకొని లెయ్యనక్కర్ల్యా. రోజూ నీళ్లు బోసుకోనక్కర్ల్యా. తలకు ఆముదం పెట్టుకోనక్కర్ల్యా. "మల్లేసు మాస్టరు కొడ్తాడు, నాకు బయం, నేనుబోను, నా కడుపుగూడా నొస్సాంది" అని రోజూ ఏడుపుమొగం బెట్టుకోని మా చిన్నోడు చేసే కార్యక్రమం ఉండదు. నిజంగానే కడుపు నొచ్చాన్యాగానీ తల నొచ్చాన్యాగానీ నీరసంగా ఉన్యాగానీ అట్నే ఏడ్సుకుంటా బడికిబోనక్కర్ల్యా. వగేల యారోజన్నా బడికిబోకపోతే ఎందుకుబోలేదో చెప్పేదానికి మర్సురోజు నాయన్నుంచీ చీటీ దీస్కపోనక్కర్ల్యా. మా అత్తమ్మకొడుకు కూడా బడికొచ్చాన్న్యాడు. నిజ్జంజెప్పాలంటే ఆయనతోబాటు మేం బడికిబోతాన్న్యాం. ఎందుకంటే మా అందర్లోకీ గట్టోడు, గలాటాలొస్తే తట్టుకోని నిలబడేవోడు గాబట్టీ. నాకన్నా రెండున్నర నెలలు పెద్దోడు అంతే. చిన్నప్పట్నుంచీ ఆయన్ను మామా అనడం అలవాటుజేసినారు మావోళ్ళు. మామ ఇప్పుటికీ మామే. ఇంగ రోంచేపటికీ మామే! మా

న త్వం శోచితుమర్హసి!

మూడు నెలల క్రితం ఈ రచనను అందంగా ముస్తాబుచేసి ప్రచురించినందుకు ఈమాటవారికి కృతజ్ఞతలు. మాంచి నిద్దట్లో వుండఁగా దవడకింద సురుక్కుమనింది. ముల్లుగర్ర [ 1 ] తో బొడిసినట్టు. దిగ్గున లేసినిలబడబోయి తలుగు [ 2 ] ముందరకాళ్లకు తగులుకోని దభీమని యడంపక్కకు పడిపొయ్‌నా. పెద్దపాటు. నా దవడ కిందినుంచి ఒక గుఱ్ఱపుటీగ యనక్కు తిరిగిసూడకండా అలికిడే లేకండా ఎగిరిపాయ నామింద అలిగినట్టు. ఈగ ఎగిరిపోయినదిక్కు మోరెత్తి [ 3 ] సూద్దామంటే మొగదాట్లో [ 4 ] యిరక్కపోయుండాది నా యనక్కాళ్లలో యడమది. ఈగ కుట్టఁగానే ఆ సురుక్కు నాకు తెలీకండానే దాన్నితోలబొయ్యి యనక్కాలు మొగదాట్లో యిరికించుకున్న్యా. కాలు యనక్కు తీసుకుందామంటే పక్కటెమకల్లో నొప్పి. ఊపిరి బిగబట్టి, నొప్పినీ బిగబట్టి రోంతసేపు నిమ్మళంగా అట్టే పండుకొన్న్యా. యండాకాలం. సాయంత్రం బిగిచ్చిన గాలి - నడిరేతిరి దాఁకా కదల్నేల్యా. మా రామునికి, రాముని పెండ్లానికిగూడా నడిరేయిదాఁక నిద్దరబట్టలా. గాలితోలినా తోలకపోయినా వాళ్లకు అంత తొందరగా నిద్దరబట్టదులే, మొన్నీమధ్యనేగదా మా రామునికి జతకుదిరింది. నడిరేయి దాటినాంక మొగుడూపెండ్లాలిద్దురూ దోమతెర తీసి టార్చిలైటేసి మంచం దిగొచ్చి నాకూ నా జతగాడు కోడె