ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ఆగస్టు, 2009లోని పోస్ట్‌లను చూపుతోంది

జిమ్మీ అటాక్ - 2

మల్ల కొన్ని నెల్ల కు ... ఇంకో చిన్న కుక్కపిల్ల. యర్రమన్ను రంగు. మూతి నలుపు. టైగర్ సోదరుడే. దీనికి మాత్రం మేం పేరు పెట్టగుడదు అనుకున్న్యాం. టైగర్ చచ్చిపొయినాఁక, కుక్కలు ఎన్నాళ్లు బతుకుతాయి అని కనుకున్న్యా. డాగ్ ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మ్యాన్ - అంటారు గానీ, మహా ఐతే అది పదీ పన్నెండేండ్ల ఫ్రెండ్షిప్పే - యెంత జాతికుక్కయినా . అందుకే ఈ కుక్క పిల్లను ముద్దుజెయ్యకూడదు అనుకున్న్యాం. పొద్దన్నుంచి రేడియోలో కామెంటరీ వస్తాంది. ఇండియా-వెస్టిండీస్ క్రికెట్ టోర్నమెంటు. ఇండియా గెలుస్తుందనే అనుకున్న్యాం. ఓడిపోయింది. కారణం జిమ్మీ ఆడమ్స్ బ్యాటింగ్. ఆ రకంగా కుక్కపిల్లకు జిమ్మీ అని పేరుబెట్టినాం. 'జిమ్మీ వుస్కో' అంటే ఏంబాగుంటాది? వుస్కో బదులు 'జిమ్మీ అటాక్' అంటే బాగుంటాదిగదా, మనకు ఇంగ్లీషు వచ్చినట్టుగూడా కనబడతాదని 'అటాక్' అలవాటుజెయ్యాలనుకున్యాం. మళ్లో దొంగగొడ్డు వొచ్చి పడబోతాందనుకో, అప్పుడు 'జిమ్మీ అటాక్' అన్యాం. సరైన కుక్కపిల్లైతే గొడ్డును తరమాల గదా? ఊహూఁ! తోక వూపుతా దగ్గరకొచ్చింది. ఇట్ల చెబితే దీనికి తెలీదని, 'వాయమ్మో..దొంగ గొడ్డు..మడి మొత్తం నాశనంజేశ..జిమ్మీ అటాక్'