ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

నవంబర్, 2008లోని పోస్ట్‌లను చూపుతోంది

యీటి రంగే పచ్చనేమో సామీ!

మాయింట్లో నువాక్రాను, మోనోక్రోటోపాసు, ఎండ్రీను డబ్బాలు శానా వుండేటియ్యి. వంకాయలు, బెండకాయలూ పండిస్తా వున్యాములే. వాఁటితోపాటు జాలాట్లో నాలుగు టమాటాచెట్లు, గెనాల మింద గోగాకు, చిన్న పెడలో మిరపజెట్లు గూడా. అప్పుడు మాయింట్లో కూరలేం జేచ్చాన్యామో మల్లా జెప్పాల్నా! నూనొంకాయ, వంకాయపులుసు, బెండకాయపులుసు, వంకాయ్ తాళింపు, బెండకాయ్ తాళింపు, వంకాయ-బెండకాయ-టమాటా పుల్లగూర, టమాటాగుజ్జు, గోగాకు ఊరిమిండి, అన్నీ కలిపికొట్టి యింగో పుల్లగూరా, యిట్ట యెన్నిజేసినా నాకు మాత్రం యిష్టంగా ముద్ద దిగేదిగాదు. అన్నిట్లో వం, బెం, టం, గోం. యింట్లో ఎవురికీ బువ్వ మాత్రం సగించేదిగాదు. ఆ చెట్లల్లో తిరిగి, పుచ్చులు యేరేసి, పండుగాయలు పారేసి, మల్లా అయ్యే తినాలన్యా తింటారేమోగానీ, కాయలు కోసి మూటగట్టి గంపలకెత్తి, బస్సులో మనుషులకూ లగేజికీ చార్జీలు బెట్టి రాయచోటికి యేసకపొయ్యి మండీల్లో అమ్ముకోని యింటికొచ్చి లెక్కజూసుకుంటే, కూలీలు బోఁగా యాభై నష్టమని వొగరోజు, పద్నాల్రూపాయిలు లాభమని యింగోరోజు తేలేటప్పుటికి ఎవురికైనా తిండి సగిస్తాదేమో నువ్వేజెప్పు! సీలకూర తినాలని గెట్టిగా అనిపిచ్చింది. మా నాయన, పండ్లు ల్యాకపొయ్‌నా మా తాత - సీల కూరకు ఎ