ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ఆగస్టు, 2006లోని పోస్ట్‌లను చూపుతోంది

సత్యము మిమ్ము ముక్తులను చేయును

వీరబల్లెకూ పక్కనున్న వంగిమళ్ళకూ రెండు మైళ్ళ దూరం, మధ్యలో రెండేర్లు అడ్డం. జనాలు వీటిని యీరబల్లేరు [అసలు పేరు మాండవ్యనది], వొంగిమాళ్లేరు అని పిలుస్తారు. వంగిమళ్ళలో సరైన బడి లేకపోవడంతో పిల్లోళ్లంతా వీరబల్లెకు రోజూ నడిచి వొచ్చిపొయ్యేవాళ్ళు. అలా కష్టపడి పైకొచ్చినవాళ్ళు చాలామంది ఉన్నారు వంగిమళ్ళనుంచి. అప్పుడు నేను ఐదో తరగతి.ఆ చుట్టుపక్కల బాగా పేరు పొందిన శ్రీ శ్రీనివాసా కాన్వెంట్లో. వంగిమళ్ళ నుంచి మా చిన్నమ్మ కొడుకు మస్తాన్ రెడ్డి [ఒకటో తరగతి అప్పుడు] రోజూ నడవడం కస్టమని మా ఇంట్లోనే ఉండి బడికి పొయ్యేవాడు. ఒక సారి శెలవు రోజుల్లో నేను నా ఐదో తరగతి మిత్రులతో పాటు మస్తాన్ రెడ్డి వాళ్ళింటికిబోయినా. వాపసు వొచ్చేరోజు పొద్దున్నే మస్తాన్ రెడ్డికి రెండు నెలల కాన్వెంటు ఫీజుకని వాళ్ళమ్మ ఒక యాభై రూపాయల నోటు నా చేతికిచ్చింది. ఆ యాభయ్యి నేను చెడ్డీ జెబులో పెట్టుకొని ఆదరా బాదరా మిగతా పిల్లకాయలతో పాటు బడికి బయల్దేరినా. *** *** *** మరి, వంగిమళ్ళ పిల్లకాయలంతా ఉండారిప్పుడు...ఆడపిల్లలు కూడా. వొంగిమాళ్లేట్లో నీళ్ళకన్నా యిసకే ఎక్కువగా ఉంది. మన ప్రత్యేకత చూపడానికిది మంచి అదును అన

జనులాపుత్రుని కనుగొని పొగడగ

"నేను పాడుకొంటాను" అంటారు ఘంటసాల . తెల్లవారినంత,కొమ్మ పూసినంత, కోయిల కూసినంత సహజమైన శోభ ఘంటసాల పాటలో ఉంటుంది. కాదరయ్యపాట కూడా "నేను పాడుకొన్నది". "పాడాలంటే హృదయం ఊగాలి" అన్నారో సినీకవి. పెద్దోళ్ళంతా నా చుట్టూ చేరి (అందరూ పెద్దోళ్ళే, ఎందుకంటే నేనప్పుడు చిన్నోణ్ణి) పాడమని మరీమరీ అడిగే వాళ్ళు. మా అమ్మమ్మగారి ఊళ్ళోఅయితే మరీ ఎక్కువ. సాయంత్రం అందరూ ఊరి మధ్యలో దేవళం దగ్గర చేరేవాళ్ళు. మరి పాట వినాలంటే కాదరయ్య చిన్ని హృదయం ఊగే వాతావరణం సృష్టించాలి. ఊగేవరకూ ఓపికపట్టాలి. కొంత మంది పెద్దోళ్ళు తొందరపెట్టే వాళ్ళు. హడావిడిగా వీళ్ళను వారించేవాళ్ళు వీళ్ళకన్నా పెద్దోళ్ళు. తొందరపెడితే కాదరయ్య హృదయం ఊగే అవకాశాలు తగ్గిపోతాయని తెలిసినోళ్ళు వీళ్ళు. చుట్టూ అభిమానులు. అందరూ వయసులో పెద్దోళ్ళే. మధ్యలో ఆకర్షణ కేంద్రం కాదరయ్య ఉరఫ్ నేను. "ఊ..." అనేవాళ్ళు ఒకరు... పాట ప్రారంభానికి ఊతంగా. "పాడతాడు ఉండండ్రా" -- మిగతావాళ్ళను కసిరినట్టుగా అని నా ప్రాముఖ్యాన్ని పెంచేవాళ్ళు కొందరు. నిశ్శబ్దం... అందరి చూపులు కాదరయ్య పాట కోసం... అది అనువైన వాతావరణం అనిపించి, పాట మొదలు