ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

జూన్, 2009లోని పోస్ట్‌లను చూపుతోంది

అలాల్ - ముద్దార్

"కోళ్లను అమ్ముకుంటే లెక్కొస్తాది. కోసుకుంటే యేమొచ్చా౨దీ?" ఇది మాయమ్మ చెప్పే మాట. చెప్పాల్సిన పన్ల్యా. అమ్ముకుంటే లెక్కొస్సాదని అందరికీ తెలిసిందే. కోసుకుంటే ఏమొచ్చా౨ది? గుడ్లకోడి పులుసు వొగిరిచ్చుకుంటా తినేవోళ్లందరికీ తెలుసు మజా. ఎంత తెలిసినోళ్లకైనా సరే, ఇంట్లో ఎన్ని కోళ్లున్యా సరే, మాంచి గుడ్లకోడిపెట్టను కోస్కోని తినాలంటే గుండెనిబ్బరం కావాల్సిందే. ఎందుకంటే దాన్ని అమ్ముకున్యా లెక్కే. గుడ్లుబెట్టనిచ్చి పొదగబెట్టినా లెక్కే. సరివేలుకిచ్చినా లెక్కే. రోగాలకూ బావురుబిల్లులకూ ముంగీసలకూ గద్దలకూ డేగలకూ పొయ్యేటియి పోతాండఁగా, పుంజులూ పెట్టలూ బొమ్మెలూ పిల్లలూ అన్నీ కలిపి రోంత అటూయిటూగా నూటాయాబై కోళ్లదాకా వుంటేటియ్యి మా ఇంట్లో. అది మామిడికాయల కాలం. మా అమ్మమ్మా-తాతా మా ఇంటికొచ్చి, నాల్రోజులు వుండమంటే వున్యారు. మా తాత మధ్యానం పూట సేరు నిండా వొడ్లు ముంచుకొని, మా ఇంటి ముందరి మామిడిచెట్టు కాణ్ణించి పెద్దమామిడి చెట్టుదాకా, ఒక సుట్టు వొడ్లు జల్లి బబ్బబ్బబ్ అని పిలిస్తే... యేయే చెట్లకింద, పాదులకింద, కాలవల్లోనో యారకతింటా వుండే కోళ్లన్నీ రెపరెపరెపా రెక్కలు కొట్టుకుంటా ఎగిరొచ్చి వాలిపొయ్యేటియి. బొమ్