ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

మార్చి, 2008లోని పోస్ట్‌లను చూపుతోంది

మొండికి గండిదేవుడు

చింతమాని కింద ఇసకలోనే మా నాగన్నైవోరి బడి. భట్టుపల్లె ప్రాథమిక పాఠశాల అని దానికి ఇంగో పేరు గుడకా వుండాది - చింతమానికి తగిలిచ్చిన యినపరేకు మింద. ఐవోరు యింగా బడికి రాల్యా. పిల్లకాయలంతా ముందే ఇసకలో జేరి ఆడుకుంటా వుండారు. నాగ్గూడా వాళ్లమాదిరే ఆడుకోవాలనిపిస్తాది గానీ, మాయమ్మ నాకు పొద్దన్నే నీళ్లుబోసి, ఇస్తిరిగుడ్డలు తొడిగి, తలకు ఆముదం పెట్టి దువ్వి, మొగానికి పౌడరుపూసి పంపిస్తాది. మాయమ్మకు అన్నీ వచ్చుగానీ నా జుట్టుకు నొప్పి తెలీకుండా తల దువ్వడం మాత్రం రాదు. దానికి మాయవ్వ రావాల్సిందే. మాకు జుట్టు దువ్వేటప్పుడు మాయవ్వ చెప్పే సదువు ఏమిట్రా అంటే - 'బడి యిడిసిపెట్టినాఁక గూడా దువ్వినజుట్టు దువ్వినట్టే వుండాల, వూళ్లో పిల్లకాయలకూ రెడ్డేరి పిల్లకాయలకూ తేడా తెలియాల, అల్లరి జనంతో ఆడుకుంటే కొట్లాటలొస్సాయి, మనం ఇంకొకరితో మాటలు పడగూడదు' అని. పొద్దన్నే చింతమాని కింద ఇసక సల్లగా సక్కిలిగిలి పెడతాన్నిట్టు వుంటాది. ఒకరిద్దరు పిల్లకాయలు తొడలకిందుగా చెడ్డీలో ఇసకపోసుకోని దాని సలవను పిర్రలకు సూపిస్తాండారు. కన్నాగాడు వొక్కడే వొగ పక్కన కుచ్చోని చూస్తావుండాడు. వాళ్లమ్మ గూడా వానికి పొద్దన్నే నీళ్లుబోసి, ఉతికి