ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

మే, 2007లోని పోస్ట్‌లను చూపుతోంది

పిల్లలూ దేవుడూ - బడితెపూజ

బోర్డుమింద ఆరు పేర్లుండాయి. కొన్ని పేర్లపక్కన ఇంటూలు గూడా వుండాయి. మాస్టర్ లేనప్పుడు మాట్లాణ్ణ్యామంజెప్పి, ఆ పేర్లేసింది క్లాసులీడరు రాశ్శేకర్. ఎందుకు మాట్టాణ్ణావు అనేది అనసరం. గొనిగినావా, గునిసినావా, గుసగుసలాణ్ణాఁవా, సైగజేసినావా అనేదిగూడా అనవసరం. మాట్టాణ్ణావా లేదా!? అంతవరకే. అస్సలు ములాజా లేదు. వొగసారి బోర్డుమింద పేరుబణ్ణాక, మల్లా మాట్టాడితే వొగ ఇంటూ. మల్లామాట్టాడితే యింగో ఇంటూ. పేరుపక్కన ఎన్ని ఇంటూలు బడితే వాని కర్మ ఆరోజు అంత బలంగా వున్నిట్టు. కర్మకన్నా బలవంతుడు మణ్యం. మణ్యం పేరుపక్కన ఇంటూలు బోర్డును దాటి గోడమీదిగ్గూడా బొయినయ్. వాని పేరు కిందనే నా పేరూ ఉండాది. ఇంటూల్లేవు. క్లాసురూము బయట మల్లికార్జునమాస్టర్ గొంతు యినబడింది. ఇంగో మాస్టర్‌తో కుశాలగా నవ్వుతా ఏందో మాట్టాడతాండాడు. ఆ గొంతు వెలుగు దగ్గరగా రాగానే, పిల్లకాయలంతా పుస్తకాల్లో తలలు దూర్చి ఒకటే దీక్షతో తపస్సుజేస్తున్నిట్టుగా సదవడం మొదులుబెట్న్యారు. బయట ఎంత నవ్వినా లోపలికి రాఁగానే ఆయన "మాస్టర్" అయిపోతాడని మాకుదెల్సు. మాస్టర్ అడుగుల సప్పుడు దగ్గరైంది. దూరంగా తోడేలు అలికిడి యినపడఁగానే మేత ఆపి, చెవులు రిక్కించి, బొబ్బరిచ్చుకొ