ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ఏప్రిల్, 2009లోని పోస్ట్‌లను చూపుతోంది

పెట్లగొడతా !

మా అమ్మోళ్ల నాయనకు నేనంటే చానా ఇష్టం. నా తరవాత ఆయనకు ఏడుమంది మనమండ్లూ మనమరాండ్లూ కలిగినా నామిందనే ఆయనకు బ్రమలెక్కువ అనేవోళ్లు. ఆ బ్రమ గుఱించి మాయమ్మ మాటిమాటికీ వొక సంగతి చెప్పేది. ఒకనాడు నేను గమ్మున కుచ్చోనుంటే మా గోపీగాడు పరిగెత్తుకుంటా వచ్చి గోళ్లతో నా మొగంమింద కచ్చగా గిచ్చినాడంట. అప్పుడే దేవునింట్లో దీపానికి దండంబెట్టి బయటికొచ్చినాడంట, ఇదంతా ఆయన కంటబడింది. నేను నొప్పికి తట్టుకోల్యాక ఏడ్సినానంట. గుడ్లురుముతా పళ్లుకొరుకుతా మా గోపీగాని చెంప పగలగొట్టి, కోపం చల్లారక మొగం యర్రబారి, బుసలుగొడతా, వూగిపోతా, చూపుడువేలు చూపిస్తా "పెట్లగొడతా ఏమనుకున్యావో" అన్యాడంట. అప్పటికి మా గోపీ వయసు మూడేండ్లు కూడా వుండదంటుంది మాయమ్మ. ఆయన అంతగా సోదీనం తప్పడం ఇంట్లో అందరికీ చానా నొప్పిగలిగించినట్టుంది. "పెట్లగొడతా" అనే మాట గుర్తుండిపోయింది. ఈ మాటను ఆయన తప్ప ఇంగెవురూ అనంగా నేను విన్లా. ****** ****** ****** ఆం. ప్ర. బాలుర గురుకుల పాఠశాల, ముక్కావారిపల్లెలో ఎనిమిదో తరగతి చివరిదినాలు. మాకన్నా ముందు పదోతరగతికి పరీక్షలు. ఏడు, పది తరగతులు ఒక హౌసులో. దాని ఎదురుగా స్టాఫు ర