ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

సెప్టెంబర్, 2008లోని పోస్ట్‌లను చూపుతోంది

గోమాతలు - జోరీగలు - బుద్ధిమంతులు

పొద్దు గూకింది. వరి మడి గెనం మీదుండే గడ్డిని మా జెర్సీ ఆవు గబగబా మేస్తాంది. బాయిలో నీళ్లు సరిగా వూరక, వూరినా తోడేదానికి కరంటు సరీగా రాక, కనాకష్టంగా కాపాడుకొంటా వుండిన వరిమడి. సందు దొరికితే నాలిక చాపి నోటినిండా పచ్చని వొరిమడిని అందుకొని తినెయ్యాలని కూడా చూస్తా వుంది ఆవు. దాని మొగదాడు పట్టుకొని గెనం మింద నిలబడుకొని .. నేను. అప్పుటికి దాని దొక్కలు* సుమారుగా పైకి లేసినాయి. ఆకాశంలో పడమటి దిక్కున వుండే వొకట్రెండు మోడాలు యర్ర రంగు నుంచి నలుపుకు తిరుక్కుంటాండాయి. మొబ్బయితే యింటికి తోలకపోయి కట్టేచ్సామని మా యావుకు తెలుసు. నాకు ఆ బుద్ధి పుట్టనీకండా 'శానా పనుండాది నాకు' అన్నెట్టుగా శర్దగా మేస్తాంది. జెర్సీ ఆవుకు యంత గెడ్డి మాత్రం యేమి సరిపోతాది? సందేల పూట ఆ రకంగా మేసే ఆవును మొగదాడు పట్టి ఇంటికి తోలకపొయ్యి నీళ్లు తాపి కట్టేసేవాడు పాపాత్ముడు. ఆ మాట ప్రకారం నేనుగూడా పాపాత్ముణ్ణే. యేం జేచ్చాము? ఆ మొబ్బులో చీటీగలు* కరుచ్చాంటే యంతసేపని గెనం మింద నిలబడుకోని మేపుతాము!? కాకపోతే ఆ రోజు మాత్రం, దాని దొక్కలు నిండి, నీళ్ల కోసం దానికదే యింటికి పరిగెత్తిందాఁక - నేనుగా తోలక పోగూడదనుకున్యా. ఇంగా రోంత యల