ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ఏప్రిల్, 2007లోని పోస్ట్‌లను చూపుతోంది

చిరకాలమున్న నేకార్యమగును!?

వీరబల్లె. పదిహైదేండ్ల క్రితం. ఊరికి పడమట ఉన్న రక్షకభటనిలయం ఆవరణం లో... అప్పటికి దాని చుట్టూ ఇనుపకంచె లేదు, ఇప్పుడున్నంత బందోబస్తు లేదు, నక్సలైట్లు లేవు, వీధిలైట్లు మాత్రమే ఉండేవి. పొద్దుగూకి చానా సేపయింది. దట్టమైన పెద్దపెద్ద రావిచెట్ల గుంపు. అడుగడుక్కూ ఒక గూడు కట్టి కాకులు దాన్ని మరింత చిక్కగా చేశాయి. అవి గూళ్లకు చేరే వేళ మహా కోలాహలంగా ఉంటుందక్కడ. ఆ మానుల మీద పున్నమైనా సరే, కింద మాత్రం అమవాస్యే. పండు వెన్నెల. ప్రశాంతమైన గాలి. కాకులన్నింటికీ నిద్రపట్టినట్లుంది. ఒక కాకిపిల్ల మాత్రం మేలుకొనే ఉంది. "మ్మా..." వాళ్లమ్మ మెడ కింద మెల్లిగా ముక్కుతో గీకింది. "ఊఁ..." అలసి ఉన్నా ఓపిగ్గా మృదువైన కంఠంతో ఏమిటని అడిగింది అమ్మ. "పుట్టినరోజు పండగ మనింట్లో ఎప్పుడొచ్చాది?" ఎన్నో దినాలుగా అడగాలనుకొన్న సంగతి అడిగింది. అమ్మకు ఆ ప్రశ్న చాలా ముచ్చటగొలిపింది. మగతలోనే మురిపెంగా అంది - "నువ్వు బుట్టింది పున్నమినాడు నాయినా. ఆ యెన్నెట్లో సందమామ మాదిరి నిగనిగ మెరిసిన నిన్నుజూసి..." "మడే, ఈరోజు పొద్దన్నే పోలీసోళ్లింట్లో ... ఆ పండగ. మనింట్లో ఎప్పుడూ అని" "అదా