ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

మార్చి, 2009లోని పోస్ట్‌లను చూపుతోంది

అమ్మను తిట్టగాకురా నీయమ్మనాయాలా

మా యీరబల్లెలో సుబ్బమ్మ అని పాపం ఒక ముండమోపామె వుండేది. నేను శ్రీ శ్రీనివాసా కాన్వెంటుకు పొతాన్నెప్పుడు చేత కట్టె బట్టుకొని, అడుగులోఅడుగేసుకొంటా, మెల్లిగా రోడ్డెంబడీ శివయ్యంగడికాడికి వస్తా కనబడేది. ఆఖరిగా ఏడోతరగతి పబ్లిక్ పరీచ్చలప్పుడు చూసినానంతే. ప్రతిదినామూ కనిపిచ్చే సుబ్బమ్మకు పాపం ఎవురూ లేరని నాకెవరో చెప్పినప్పుడు - "ఐతే, ఆమెప్పుడన్నా పాలుమాలితే ఏమి గతీ?" అనేది నాకొచ్చిన మొదటి అనుమానం. యాల్నంటే, కాన్వెంటుకు పొయ్యి వచ్చేటప్పుటికి నాకు దినామూ తల నొచ్చేది. దొంగ తలనొప్పి కాదు. నాకు తలనొస్తే మా నాయనకు తలనొచ్చినట్టుగా బాధపడతాడు. మాయమ్మ ఆముదం పట్టు వేసేది. కణతలు నొక్కేది. కాఫీ జేసిచ్చేది. అనాసిన్ సగం తుంట మింగిచ్చేది. పాత గుడ్డతో తలను బిగిచ్చి కట్టేది. కాళ్లొత్తేది. నేను నిద్దరబొయ్యేదాక ఆణ్ణించి కదిలేదిగాదు. ఇట్టగాదన్జెప్పి కాన్వెంటు మానిపిచ్చేసింది. సుబ్బమ్మకు తల నొస్తే ఏమి గతి? జొరమొస్తే కాళ్లొత్తే మాట పక్కనబెట్టు, రోంత కూడు వుడకేసేవోళ్లెవురు? ఎవురో వొగరు వుంటార్లే అనుకుండేదానికిల్యా. యేమంటే, సుబ్బమ్మ మొగం జూస్తే దరిద్రమని మా కాన్వెంటు పిల్లకాయల నమ్మిక. బడికిపొయ్యేటప్పుడు గడి