ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

డిసెంబర్, 2007లోని పోస్ట్‌లను చూపుతోంది

యేందిబ్బా యేమర్థంగాల్యా!

బైట చానా రొచ్చు గా వుండాది. మూడు దినాల నుంచీ వొగటే ముసురు . మోజులుమోజులుగా తువ్వర రాల్తానే వుంది. ఈ జడి తో యెవురికీ మేలు ల్యా. పెద్దవాన పడి సస్తే చెఱువన్నా మొరవబోతాది, బావులు నిండతాయి, బడికి శలవలన్నా యిడుచ్చారు. శుక్రవారం తుంపరలోనే బడికిబోతిమి. బళ్లో పిల్లనాయాండ్లు తొక్కితొక్కి న్యాల మొత్తం రొచ్చు రొచ్చు జేసిరి. శనివారం గూడా అంతే. ఆ రొంపి లోనే సల్లటి బండల మింద సాయంత్రం దాఁక కుచ్చోనొచ్చినాం. సరే అనుకుంటే ఆదివారంగూడా అదే ముసురు. బైటికిబొయ్యి ఆడుకుండేదానికి ల్యా. యాలంటే [ఏలనంటే] ఇంటి బైటనే పెద్ద గుంత తొగిచ్చినాంలే బయోగ్యాస్ కోసరమని. ఆడుకుంటా ఆడుకుంటా మేము యాడన్నా ఆ గుంతలో బడతామేమో నని. ఆ గుంత గూడా నీళ్లతో నిండల్యా. అట్టాటి పనికిమాలిన వాన. మాకు కావిలి మా తాత. కాయితాల్తో పడవలు జేసి వరండా నీళ్లలో వొదిల్తే చినుకులకు తడిసి ఆణ్ణే మునుగుతాండాయి. ఇంటికాడ ఎవురూ లేరు. "అయిన కాడికి శెనిగచెట్లు పెరికి ఓదె బెడదాం, మల్ల యట్టైతే అట్టగానీ. ఇట్టే ఇంగ రెండ్రోజులు ముసురు పట్టిందంటే పంట కుళ్లిపోతాది, శనక్కాయలు మోసు లొచ్చాయి" అని, దొరికిన కాడికి కూలోళ్లను బలంతం [బలవంతం] జేసి మడి కాడికి పిలచక ప