ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ఏప్రిల్, 2008లోని పోస్ట్‌లను చూపుతోంది

పిల్లోళ్లను కారిమింటుకు పంపీ

యండాకాలం శలవల్లో చింతచెట్టుకింద జిల్లాకోడి ఆడుకుంటావుంటే యింట్లోకి పిలిసి, పలకమీద A B C రాసి, దిద్ది నేర్చుకొని రాసిమ్మన్యాడు మా నాయిన. వాటిని బలపంతో రెండుసార్లు దిద్ది చెరిపేసి, టకీమని రాసి చూపిచ్చి, మల్లా చింతచెట్టుకిందికి పరిగెత్తినా. రోంచేపటికి మల్లా పిలిచి ఏబీసీడీలన్నీ రాసి పలికిచ్చి, రేపట్లోగా పలకడము, దిద్దడమూ నేర్చుకొమ్మనె. ఈ ఏబీసీడీలు పలకడం నాకు ముందే తెల్సు. "ఏబీసీడీయఫ్ - మీ తాత ఉఅ* ఠప్" అని ఒక పాటవుండేది. ఈ పాటతోనే నాకు ఏబీసీడీలు తెలిసింది. యింగ్లీసంటే ఏందో గూడా నాకు రెండోతరగతిలోనే తెల్సు. గాంధీతాత పాఠమొకటి వుంది. దాంతో తెల్లదొరలు, బ్రిటీషువారు, ఇంగ్లండు కూడా తెలుసు. ఆ తరువాత యాంట్ చీమ, బోయ్ బాలుడు, క్యాట్ పిల్లి వుండే బొమ్మలపుస్తకం కూడా నేర్చేసుకున్న్యా. "సదువంతా నువ్వే నేరిపిస్చావా, పిల్లోళ్లను కారిమింటుకు పంపీ" అని మా యింటికొచ్చిన పెద్దోళ్లంతా మా నాయనకు చెప్పబట్టిరి. ఆ 'కారిమింటు' నాకేం కొత్తదిగాదు. మా పల్లెకు సుమారిగా ఒక మైలు దూరాన వీరబల్లెలో వుంటాది శ్రీ శ్రీనివాస కాన్వెంటు. భట్టుపల్లె బళ్లో వొగటో తరగతి సదవంగానే, రెండో తరగతికి నన్ను దాంట్లోన