అప్పటికి నాకు సరిగ్గా నాలుగేళ్ళు కూడా నిండి ఉండవేమో...
ఎండాకాలం రాత్రి పెరుగన్నం తిని కిరసనాయిలు బుడ్డీలు ఆర్పి,
రాతిమిద్దె యనకాల నులక మంచలమీద ఎచ్చని నారపరుపులేస్కోని పండుకొని
సల్లగ గాలి తగుల్తాఉంటే ఆకాశంలో నిజ్జంగా సందమామగాదు కదిలేది మోడాలేనని
ఆ పల్లె మొత్తంలో నాకు మా నాయనకే తెలిసినట్టు ఒక పరమానందంతో
మబ్బుల ముసురు, మధ్యలో చుక్కలు, గాలి వేగం, మెరుపులు గమనిస్తూ
'ఇప్పుడు వాన పడుతుందా లేదా' అని పెద్ద ఖగోళ శాస్త్రవేత్త మాదిరి ఆలోచనలో ఉండగా
మా నాయన పాట మొదలు పెట్టినాడు నేను పలకడం మొదలుపెట్టినా.
*** *** ***
తెల్లారేసరికి భట్టుపల్లెలో నేనో ఘంటసాల, నా పేరు కాదరయ్య ఐంది.
విజయవంతంగా రాకెట్ ప్రయోగించిన అబ్దుల్ కలాం మాదిరిగా సంబర పడి ఉంటాడు మా నాయన బహుశా .
ఆ పాటతో నాకు వచ్చిన గుర్తింపు ఆ తరువాత కూడా కొనసాగుతూ ఉంది.
బెస్తోళ్ళ పెద్దోడు ఇప్పటికీ నేను కనబడితే "ఏం కాదరయ్యా బాగుండా(వా)?"
*** *** ***
చిన్నప్పటి నుండి "ఓ పెద్దోడా...!!" అని అరవడమే అలవాటైంది
పెద్దోడు నిజెంగానే నా కంటే వయసులో చానా పెద్దోడని తెలిసేసరికి పిలుపులో మార్పు ఎబ్బెట్టుగా తోచింది...
*** *** ***
ఆ మధ్య ఒకసారి పల్లెకు పోతే పెద్దోడు మా ఇంటికి వచ్చి పలకరించినాడు.
అదే పలకరింపు "ఏం కాదరయ్యా బాగుండా('వా' వినపడీ-వినపడకుండా)?"
సంతోషంగా నవ్వి తలాడించి "మీరు బాగుండారా?" అని అడిగితే...
"మాకేమిలే బాగుండాము..." అంటూ మొగంలో నవ్వు మాయం చేసి అనుమానంగా చూస్తూ...
"మీ నాయన మీకొసం శానా అగసాట్లు పణ్ణాడు. మీరు ఎట్ట సూసుకుంటారో ఏమో...
నేనొచ్చి సూచ్చా... ఏమన్నా ఏరేగా ఉన్నిందంటే మీ సెయిబట్టుకోని ఇరిశాచ్చా"
*** *** ***
మరి అంత అభిమానంగాజెప్పినప్పుడు 'ఏమన్నా ఎరేగా' ఎందుకుండాల?
*** *** ***
మారుతున్న సమాజ పరిస్థితుల్లో పెద్దవాళ్ళైపోయిన తలిదండ్రులకు ప్రాధాన్యం సన్నగిల్లుతోంది. పెళ్ళిళ్ళు కాగానే ఉద్యోగాలు, పని ఒత్తిళ్ళు, ఇతర సంసార బాధ్యతలు, సంపద పెంచుకొనే ఆలోచనలతో (సెటిల్ కావటం అంటారు దీన్ని -- ఎంత సంపాదించినా "నేను సెటిల్ అయ్యాను" అన్న మానవుడిని నేను చూడలేదు) సంతోషాన్ని దూరం చేసుకొన్నప్పుడు బహుశా తలిదండ్రులు చికాకు కలిగించే మనుషులుగా కనబడతారేమో.
*** *** ***
"నాకు తెలిసి బాధపెట్టకూడదు, బాధపెట్టే పని ఇది అని తెలిసిన తరువాత వెంటనే దిద్దుకోవాలి" అని ఇలా పదిమందిలో చెబితే నా ఈ బాధ్యతను పెంచుకొన్నట్లు ఔతుంది ఇది గుర్తుంటుంది, గుర్తు చేసేవాళ్ళు ఉంటారు అనిపించి ఈ సంగతి ఇక్కడ చెబుతున్నాను. అప్పుడు పెద్దోడు 'నా సెయ్యిబట్టుకోని యిరిసే' ఆలోచన కూడా మానుకుంటాడు. కదా!?

కామెంట్‌లు
చాలా బాగా రాసారు. కొడుకులకీ కూతుర్లకే కాదు మనిషన్న ప్రతీ ఒక్కరికీ మీరు చెప్పిన మాటలు వర్తిస్తాయి.
-కిరణ్
మీరు మాకు చాలా దగ్గరి వారండోయ్! భలే రాశారు, ఈ కాదరయ్య పాట నేను చిన్నప్పుడు విన్నట్లు గుర్తు. మళ్ళీ మా వూరోళ్ళతో మాట్లాడినట్లనిపించింది.
ఇది మా వూరు.
-- ప్రసాద్
http://charasala.wordpress.com
http://te.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B0%B2%E0%B1%8D%E0%B0%AA%E0%B0%A8%E0%B0%BE%E0%B0%AF%E0%B1%81%E0%B0%A8%E0%B0%BF%E0%B0%9A%E0%B1%86%E0%B0%B0%E0%B1%81%E0%B0%B5%E0%B1%81
గమ్ముగా ఉండాది!
nee blog bavundi. keep it up.
Who are u?
Looks like everybody except me knows you.
Its really superuuuuuuuu......chaala bagundi...keep it up
Anyway nice blog and continue with your spirit
ధన్యవాదాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.