Monday, July 31, 2006

పొద్దున్నే లేసినాడు కాదరయ్య

అప్పటికి నాకు సరిగ్గా నాలుగేళ్ళు కూడా నిండి ఉండవేమో...
ఎండాకాలం రాత్రి పెరుగన్నం తిని కిరసనాయిలు బుడ్డీలు ఆర్పి,
రాతిమిద్దె యనకాల నులక మంచలమీద ఎచ్చని నారపరుపులేస్కోని పండుకొని
సల్లగ గాలి తగుల్తాఉంటే ఆకాశంలో నిజ్జంగా సందమామగాదు కదిలేది మోడాలేనని
ఆ పల్లె మొత్తంలో నాకు మా నాయనకే తెలిసినట్టు ఒక పరమానందంతో
మబ్బుల ముసురు, మధ్యలో చుక్కలు, గాలి వేగం, మెరుపులు గమనిస్తూ
'ఇప్పుడు వాన పడుతుందా లేదా' అని పెద్ద ఖగోళ శాస్త్రవేత్త మాదిరి ఆలోచనలో ఉండగా
మా నాయన పాట మొదలు పెట్టినాడు నేను పలకడం మొదలుపెట్టినా.
*** *** ***
తెల్లారేసరికి భట్టుపల్లెలో నేనో ఘంటసాల, నా పేరు కాదరయ్య ఐంది.
విజయవంతంగా రాకెట్ ప్రయోగించిన అబ్దుల్ కలాం మాదిరిగా సంబర పడి ఉంటాడు మా నాయన బహుశా .
ఆ పాటతో నాకు వచ్చిన గుర్తింపు ఆ తరువాత కూడా కొనసాగుతూ ఉంది.
బెస్తోళ్ళ పెద్దోడు ఇప్పటికీ నేను కనబడితే "ఏం కాదరయ్యా బాగుండా(వా)?"
*** *** ***
చిన్నప్పటి నుండి "ఓ పెద్దోడా...!!" అని అరవడమే అలవాటైంది
పెద్దోడు నిజెంగానే నా కంటే వయసులో చానా పెద్దోడని తెలిసేసరికి పిలుపులో మార్పు ఎబ్బెట్టుగా తోచింది...
*** *** ***
ఆ మధ్య ఒకసారి పల్లెకు పోతే పెద్దోడు మా ఇంటికి వచ్చి పలకరించినాడు.
అదే పలకరింపు "ఏం కాదరయ్యా బాగుండా('వా' వినపడీ-వినపడకుండా)?"
సంతోషంగా నవ్వి తలాడించి "మీరు బాగుండారా?" అని అడిగితే...
"మాకేమిలే బాగుండాము..." అంటూ మొగంలో నవ్వు మాయం చేసి అనుమానంగా చూస్తూ...
"మీ నాయన మీకొసం శానా అగసాట్లు పణ్ణాడు. మీరు ఎట్ట సూసుకుంటారో ఏమో...
నేనొచ్చి సూచ్చా... ఏమన్నా ఏరేగా ఉన్నిందంటే మీ సెయిబట్టుకోని ఇరిశాచ్చా"
*** *** ***
మరి అంత అభిమానంగాజెప్పినప్పుడు 'ఏమన్నా ఎరేగా' ఎందుకుండాల?
*** *** ***
మారుతున్న సమాజ పరిస్థితుల్లో పెద్దవాళ్ళైపోయిన తలిదండ్రులకు ప్రాధాన్యం సన్నగిల్లుతోంది. పెళ్ళిళ్ళు కాగానే ఉద్యోగాలు, పని ఒత్తిళ్ళు, ఇతర సంసార బాధ్యతలు, సంపద పెంచుకొనే ఆలోచనలతో (సెటిల్ కావటం అంటారు దీన్ని -- ఎంత సంపాదించినా "నేను సెటిల్ అయ్యాను" అన్న మానవుడిని నేను చూడలేదు) సంతోషాన్ని దూరం చేసుకొన్నప్పుడు బహుశా తలిదండ్రులు చికాకు కలిగించే మనుషులుగా కనబడతారేమో.
*** *** ***
"నాకు తెలిసి బాధపెట్టకూడదు, బాధపెట్టే పని ఇది అని తెలిసిన తరువాత వెంటనే దిద్దుకోవాలి" అని ఇలా పదిమందిలో చెబితే నా ఈ బాధ్యతను పెంచుకొన్నట్లు ఔతుంది ఇది గుర్తుంటుంది, గుర్తు చేసేవాళ్ళు ఉంటారు అనిపించి ఈ సంగతి ఇక్కడ చెబుతున్నాను. అప్పుడు పెద్దోడు 'నా సెయ్యిబట్టుకోని యిరిసే' ఆలోచన కూడా మానుకుంటాడు. కదా!?

20 comments:

kiraN said...

ఏం కాదరయ్యా బాగుండా??

చాలా బాగా రాసారు. కొడుకులకీ కూతుర్లకే కాదు మనిషన్న ప్రతీ ఒక్కరికీ మీరు చెప్పిన మాటలు వర్తిస్తాయి.

-కిరణ్

swathi mutyalu said...

మనసు ఉన్నదున్నట్టు అక్షరాలుగా పరచగలగటం మీకు చేతయ్యింది..
బాగా రాశారు.

http:\\swathikumari.wordpress.com

spandana said...

హలో రెడ్డిగారూ,
మీరు మాకు చాలా దగ్గరి వారండోయ్! భలే రాశారు, ఈ కాదరయ్య పాట నేను చిన్నప్పుడు విన్నట్లు గుర్తు. మళ్ళీ మా వూరోళ్ళతో మాట్లాడినట్లనిపించింది.
ఇది మా వూరు.
-- ప్రసాద్
http://charasala.wordpress.com

spandana said...

correct link to my village is
http://te.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B0%B2%E0%B1%8D%E0%B0%AA%E0%B0%A8%E0%B0%BE%E0%B0%AF%E0%B1%81%E0%B0%A8%E0%B0%BF%E0%B0%9A%E0%B1%86%E0%B0%B0%E0%B1%81%E0%B0%B5%E0%B1%81

Dr.isMail said...

మొదట చదవగానే వేరే ఏ పేరు మోసిన రచయితో రాసిన దానిని మీరు బ్లాగు చేశారని అనుకొన్నాను. కానీ చివర మీ'రానారె' సంతకం చూసాక తెలిసింది...మీరేనని.
గమ్ముగా ఉండాది!

Ramanadha Reddy said...

ఇది కల్పితం కానే కాదు మస్టారూ :) కావాలంటే పెద్దోణ్ణే అడగండి.

మురళీ కృష్ణ said...

"సంతోషాన్ని దూరం చేసుకొన్నప్పుడు బహుశా తలిదండ్రులు చికాకు కలిగించే మనుషులుగా కనబడతారేమో" లాంటి మనసు కదిలించే వాక్యాలున్నాయండీ. స్వాగతం.

Vissu said...

babu kadarayya.. ee vooru manadi cuddapah lo. ikkada chaana mande vunnaru ga.

nee blog bavundi. keep it up.

చదువరి said...

నామిని చెప్పినట్లు మొగలాయిగా ఉండాది కాదరయ్యా! వ్యాసం మొత్తం సీమ యాసలో రాసినట్లే, చివరి రెండు పేరాలూ రాసి ఉండాల్సింది. మొత్తమ్మీద చక్కగా రాసారు. అలాగే.. కqఅదరయ్య పాటను చక్కగా పాడి, పాడుకాస్టు (podcast) కూడా చెయ్యవచ్చు గదా కాదరయ్యా, బ్లాగరులం విని సంతోషిస్తాం.

kiran kumar Chava said...

Sorry to ask!

Who are u?


Looks like everybody except me knows you.

Konda Reddy said...

Ramnath...
Its really superuuuuuuuu......chaala bagundi...keep it up

చేతన said...

#chaala chaala bagundi. mee #post, as well as# mee kadarayya paata. #More importantly,# seema mAnDalikam. cAlA telugu blAgullo #(including mine)# telugu lO vrAyAlani prayatninchaTam valla telugu #natural# gA kannA "prayatnam" gA ekkuva kanipistU, manam telugu 50's-80/90's sahityam talUku CAyalu ekkuva kanipistunnAyEmO. kAni pUrti gA #natural# gA unna (nAku anipincina) ati takkuva blAgullO mIdi okaTi. #I hope you keep blogging regularly#

త్రివిక్రమ్ Trivikram said...

Kudos to you for being highly conscious of your roots. It is only after we cut off the roots in our eagerness to fly high, we discover that we have no wings.

అభిసారిక said...

చాలా బాగా రాసారు.

Praveen Gadikota said...

‌కాదరయ్య కథ బాగా వుంది. విషయానికి వస్తె కాలం ఎమి మారలెదు. ఈ కాలంలొ కూడా మన పెద్దలని ఎంత మంది బాగ చూసుకుంతునారు, అల అని పాత కలం లొ అందరు వల్ల పెద్దలని బాగ ఎమి చుసుకొలెదు, అప్పుదు problems వునయి ఇప్పుదు వునయి.final గా నెను చెపెది ఒక్కతీ మన వల్లని బాగ చుసుకొవదము మన పయిన depend అయి వుంతుంది.coming to the settlement i agree with your point, but life span is too short so ఎక్కద compromise అవాలి అనిపివ్వదు అలా అని దబ్బులు అన్ని దాచిపెత్తుకొనవసరము లెదు, ఎదొ ఒకతి సాదించలి అనె తపన అంథె.మన పెద్దవాల్లు వాల్లు చెయాల్సింది చెసి ఇప్పుదు Relax తీసుకుంతునా రు ఇప్పుదు చెయల్సింది మనమె. So what i feel is no need to compromise in feel for what we want just get it.
Anyway nice blog and continue with your spirit

Nagaraja said...

"ఎంత సంపాదించినా "నేను సెటిల్ అయ్యాను" అన్న మానవుడిని నేను చూడలేదు" అని మరొక్కసారి సత్యాన్ని గుర్తుచేసారు.

రానారె said...

బ్లాగుల్లోని వ్యాఖ్యలకు సమాధానాలివ్వాలనే సంప్రదాయం నాకప్పుడు తెలీదు. కానీ ఒక లాంటి న్యూనత ఉండేది. దాన్ని పోగొట్టుకోవడానికి ఇప్పుడు ఇలా...

ధన్యవాదాలు.

Bhaskar said...

Edo telyani Anadam ,Kantlochi kaniru vachittu ga kuda teliay ledu.Navvvu vachidi,Edo manasuku ayyindi.Reall wonderful.nenu Inspire ayyanu...Edo cheppalani undi rayalani undi..mee blog naku oka kothha anubhuthi.

రానారె said...

భాస్కర్‌గారూ, మీకు కలిగిన ఆనందాతిశయమే మీ వ్యాఖ్యద్వారా నాకూ కలిగించారు. మీకు కృతజ్ఞుణ్ణి. ఏదో చెప్పాలనుంది రాయాలముందీ అన్నారే, ఆ బ్లాగుడుకాయ లక్షణమే నాతో రాయిస్తున్నది. చిన్న చిట్కా - చదువుతున్నప్పుడు మీకు ఏమేమి గుర్తొచ్చాయో, అనిపించాయో, ఎందుకలా అనిపించిందో నిదానంగా ఆలోచనచేసి అక్షరబద్ధం చేశారంటే మీరు ఇక్కడ రాసిన వ్యాఖ్యే నేనూ మీ బ్లాగులో రాయాల్సొస్తుంది. ఒక్కళ్లను నవ్వించినది మరో నలుగురిని నవ్వించి తీరుతుంది. ఏడిపించినది కూడా అంతే. తెలుగులో రాయడానికి లేఖిని ఉపయోగించవచ్చని మీకు తెలుసా!?

Bhaskar said...

నెను మీ దగ్గర నెర్చుకున మొదటి పాటాం లేఖిని వాడటం. ఏదొ ఆలా చుద్దాం అనుకొని నిండా ములిగిపొయాను. మీ ప్రొత్సహని కి ధన్యవాదలు.

Post a Comment

ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.