ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

మొండికి గండిదేవుడు

చింతమాని కింద ఇసకలోనే మా నాగన్నైవోరి బడి. భట్టుపల్లె ప్రాథమిక పాఠశాల అని దానికి ఇంగో పేరు గుడకా వుండాది - చింతమానికి తగిలిచ్చిన యినపరేకు మింద. ఐవోరు యింగా బడికి రాల్యా. పిల్లకాయలంతా ముందే ఇసకలో జేరి ఆడుకుంటా వుండారు. నాగ్గూడా వాళ్లమాదిరే ఆడుకోవాలనిపిస్తాది గానీ, మాయమ్మ నాకు పొద్దన్నే నీళ్లుబోసి, ఇస్తిరిగుడ్డలు తొడిగి, తలకు ఆముదం పెట్టి దువ్వి, మొగానికి పౌడరుపూసి పంపిస్తాది. మాయమ్మకు అన్నీ వచ్చుగానీ నా జుట్టుకు నొప్పి తెలీకుండా తల దువ్వడం మాత్రం రాదు. దానికి మాయవ్వ రావాల్సిందే. మాకు జుట్టు దువ్వేటప్పుడు మాయవ్వ చెప్పే సదువు ఏమిట్రా అంటే - 'బడి యిడిసిపెట్టినాఁక గూడా దువ్వినజుట్టు దువ్వినట్టే వుండాల, వూళ్లో పిల్లకాయలకూ రెడ్డేరి పిల్లకాయలకూ తేడా తెలియాల, అల్లరి జనంతో ఆడుకుంటే కొట్లాటలొస్సాయి, మనం ఇంకొకరితో మాటలు పడగూడదు' అని. పొద్దన్నే చింతమాని కింద ఇసక సల్లగా సక్కిలిగిలి పెడతాన్నిట్టు వుంటాది. ఒకరిద్దరు పిల్లకాయలు తొడలకిందుగా చెడ్డీలో ఇసకపోసుకోని దాని సలవను పిర్రలకు సూపిస్తాండారు. కన్నాగాడు వొక్కడే వొగ పక్కన కుచ్చోని చూస్తావుండాడు. వాళ్లమ్మ గూడా వానికి పొద్దన్నే నీళ్లుబోసి, ఉతికిన...

తా నొరులకు నవి సేయకునికి ...

ఆ పొద్దు శనివారం. బళ్లో మజ్జానం పూట అన్నానికి గంట కొట్టఁగానే, వడిసెల యిడిసిన రాయి మాదిరిగా రఁయ్‌య్యిమని కుంట కయ్య ల్లో గుండా అడ్డంబడి వొక్క పరుగున యిల్లు చేరి, నేరుగా జాలాట్లో తొట్టికాడికి బొయ్యి, చెంబునీళ్లతో గబగబా కాళ్లూజేతులూ మొగమూ కడుక్కుంటా సుట్టూ జూస్తి - అమ్మగానీ అవ్వగానీ కనబడతారేమోనని. జాలాడు పక్కన యండలో నులకమంచం మింద ఆరేసిన తువ్వాలుతో మొగం తుడుసుకుంటా, "మ్మా..." అని అరిస్తి. అరిసినప్పుడు నా మొగం తువ్వాల్లోనే వుండాది. మొగాన్ని బయటబెట్టి "మ్మో...వ్" అని యింగా గెట్టిగా వొక కేకబెడితి. "అప్పుడే పన్నెండయింద్యా?" - మా చెనగచెట్లల్లో కూలోళ్లతోపాడు గడ్డి తొవ్వుతా మడి కాణ్ణుంచి అమ్మ. ఆ మాట అనడంలో వులికిపాటు. చెనిగచెట్లల్లో గెడ్డి బలిసిపొయ్యింది. తొవ్వే పని రోంత కూడా జరిగినట్టు లేదీరోజు. పన్నిండు అనే మాట యినబడితే కూలోళ్లు లేసిపోతారు. అసలు ఆ యండకు వాళ్లు అంత వరకూ పనిచెయ్యడమే గొప్పసంగతి. ఇదంతా పట్టించుకునేంత తెలీదు మనకప్పుడు. "పన్నిండు ఎప్పుడో దాటిపోయింది. ఇంగ్లీషు వార్తలు గూడా అయిపొయినాయి." - ఇంగ్లీషు వార్తలు అయిపొయ్యేది పన్నెండు గంటలా ఐదు నిముషాలకే...