ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

చిరకాలమున్న నేకార్యమగును!?

వీరబల్లె. పదిహైదేండ్ల క్రితం. ఊరికి పడమట ఉన్న రక్షకభటనిలయం ఆవరణం లో... అప్పటికి దాని చుట్టూ ఇనుపకంచె లేదు, ఇప్పుడున్నంత బందోబస్తు లేదు, నక్సలైట్లు లేవు, వీధిలైట్లు మాత్రమే ఉండేవి. పొద్దుగూకి చానా సేపయింది. దట్టమైన పెద్దపెద్ద రావిచెట్ల గుంపు. అడుగడుక్కూ ఒక గూడు కట్టి కాకులు దాన్ని మరింత చిక్కగా చేశాయి. అవి గూళ్లకు చేరే వేళ మహా కోలాహలంగా ఉంటుందక్కడ. ఆ మానుల మీద పున్నమైనా సరే, కింద మాత్రం అమవాస్యే. పండు వెన్నెల. ప్రశాంతమైన గాలి. కాకులన్నింటికీ నిద్రపట్టినట్లుంది. ఒక కాకిపిల్ల మాత్రం మేలుకొనే ఉంది. "మ్మా..." వాళ్లమ్మ మెడ కింద మెల్లిగా ముక్కుతో గీకింది. "ఊఁ..." అలసి ఉన్నా ఓపిగ్గా మృదువైన కంఠంతో ఏమిటని అడిగింది అమ్మ. "పుట్టినరోజు పండగ మనింట్లో ఎప్పుడొచ్చాది?" ఎన్నో దినాలుగా అడగాలనుకొన్న సంగతి అడిగింది. అమ్మకు ఆ ప్రశ్న చాలా ముచ్చటగొలిపింది. మగతలోనే మురిపెంగా అంది - "నువ్వు బుట్టింది పున్నమినాడు నాయినా. ఆ యెన్నెట్లో సందమామ మాదిరి నిగనిగ మెరిసిన నిన్నుజూసి..." "మడే, ఈరోజు పొద్దన్నే పోలీసోళ్లింట్లో ... ఆ పండగ. మనింట్లో ఎప్పుడూ అని" "అదా, వాళ...

సృజన + ఆత్మక'థ'

"కోటి కోటి గుండెలలో పులకింతలు పులకింతలు కోటి కోటి గొంతులలో ప్రభవించే ఆశయాలు సాటి మనుషులందరిపై సౌమనస్య భావనలు మేటి మేటి నడతలోన రేపటి మన నవ్వులు చిరునవ్వులు చిరునవ్వులు చిరునవ్వులు" ఆకాశవాణిలో ఆదివారం మధ్యాహ్నం ప్రసారమయ్యే "పాట నేర్చుకుందాం" కార్యక్రమంలోని పాట. పిల్లలకోసం చిత్తరంజన్‌గారు నిర్వహించే ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం నుండి ప్రసారమయేది. దాన్ని మా కడపకేంద్రం రిలే చేసేది. ఈ పాటను విని నేర్చుకొనే జ్ఞానము వయసు రెండూ నాకు లేని వయసులో మా నాయన రేడియో వింటూ నాతో రాయించి అర్థం చెబుతూ నేర్పినాడు. ఆ తరువాత ఇదేపాటను నేను శ్రీనివాసా కాన్వెంట్లో, మా జడ్‌.పీ‌ హైస్కూల్లో, రాయచోటి భారతి స్కూల్లో, ఆ తరువాత ముక్కావారి పల్లెలో పాడిందే పాడరా పాసిపండ్ల దాసరీ అన్నట్టుగా శ్రోతలు మారినప్పుడల్లా చెడబాడి 'బహు'మతులు పోగొట్టాను/రాబట్టాను. ఇవన్నీ మరచిపోతానేమోగానీ పదేళ్ల వయసులో "బాలవిహార్" చిన్నపిల్లల కార్యక్రమంలో ఈ పాటను పాడటం మాత్రం మరపురాని అనుభవం. ఆకాశవాణి కడప కేంద్రంలో రికార్డయి ప్రసారం చేయబడిన నా ఏకైక కార్యక్రమం ఇదే. మన ఆంధ్రదేశంలోని ఎంసెట్ జాడ్యం నన్నూ స...