ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ఫిబ్రవరి, 2008లోని పోస్ట్‌లను చూపుతోంది

తా నొరులకు నవి సేయకునికి ...

ఆ పొద్దు శనివారం. బళ్లో మజ్జానం పూట అన్నానికి గంట కొట్టఁగానే, వడిసెల యిడిసిన రాయి మాదిరిగా రఁయ్‌య్యిమని కుంట కయ్య ల్లో గుండా అడ్డంబడి వొక్క పరుగున యిల్లు చేరి, నేరుగా జాలాట్లో తొట్టికాడికి బొయ్యి, చెంబునీళ్లతో గబగబా కాళ్లూజేతులూ మొగమూ కడుక్కుంటా సుట్టూ జూస్తి - అమ్మగానీ అవ్వగానీ కనబడతారేమోనని. జాలాడు పక్కన యండలో నులకమంచం మింద ఆరేసిన తువ్వాలుతో మొగం తుడుసుకుంటా, "మ్మా..." అని అరిస్తి. అరిసినప్పుడు నా మొగం తువ్వాల్లోనే వుండాది. మొగాన్ని బయటబెట్టి "మ్మో...వ్" అని యింగా గెట్టిగా వొక కేకబెడితి. "అప్పుడే పన్నెండయింద్యా?" - మా చెనగచెట్లల్లో కూలోళ్లతోపాడు గడ్డి తొవ్వుతా మడి కాణ్ణుంచి అమ్మ. ఆ మాట అనడంలో వులికిపాటు. చెనిగచెట్లల్లో గెడ్డి బలిసిపొయ్యింది. తొవ్వే పని రోంత కూడా జరిగినట్టు లేదీరోజు. పన్నిండు అనే మాట యినబడితే కూలోళ్లు లేసిపోతారు. అసలు ఆ యండకు వాళ్లు అంత వరకూ పనిచెయ్యడమే గొప్పసంగతి. ఇదంతా పట్టించుకునేంత తెలీదు మనకప్పుడు. "పన్నిండు ఎప్పుడో దాటిపోయింది. ఇంగ్లీషు వార్తలు గూడా అయిపొయినాయి." - ఇంగ్లీషు వార్తలు అయిపొయ్యేది పన్నెండు గంటలా ఐదు నిముషాలకే