"కోటి కోటి గుండెలలో పులకింతలు పులకింతలు కోటి కోటి గొంతులలో ప్రభవించే ఆశయాలు సాటి మనుషులందరిపై సౌమనస్య భావనలు మేటి మేటి నడతలోన రేపటి మన నవ్వులు చిరునవ్వులు చిరునవ్వులు చిరునవ్వులు" ఆకాశవాణిలో ఆదివారం మధ్యాహ్నం ప్రసారమయ్యే "పాట నేర్చుకుందాం" కార్యక్రమంలోని పాట. పిల్లలకోసం చిత్తరంజన్‌గారు నిర్వహించే ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం నుండి ప్రసారమయేది. దాన్ని మా కడపకేంద్రం రిలే చేసేది. ఈ పాటను విని నేర్చుకొనే జ్ఞానము వయసు రెండూ నాకు లేని వయసులో మా నాయన రేడియో వింటూ నాతో రాయించి అర్థం చెబుతూ నేర్పినాడు. ఆ తరువాత ఇదేపాటను నేను శ్రీనివాసా కాన్వెంట్లో, మా జడ్.పీ హైస్కూల్లో, రాయచోటి భారతి స్కూల్లో, ఆ తరువాత ముక్కావారి పల్లెలో పాడిందే పాడరా పాసిపండ్ల దాసరీ అన్నట్టుగా శ్రోతలు మారినప్పుడల్లా చెడబాడి 'బహు'మతులు పోగొట్టాను/రాబట్టాను. ఇవన్నీ మరచిపోతానేమోగానీ పదేళ్ల వయసులో "బాలవిహార్" చిన్నపిల్లల కార్యక్రమంలో ఈ పాటను పాడటం మాత్రం మరపురాని అనుభవం. ఆకాశవాణి కడప కేంద్రంలో రికార్డయి ప్రసారం చేయబడిన నా ఏకైక కార్యక్రమం ఇదే. మన ఆంధ్రదేశంలోని ఎంసెట్ జాడ్యం నన్నూ స...
మడిసన్నాక కూసింత కలా పోసన వుండాలన్నారు బాపు-రమణ !!