ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

మ్ర్యాఁవ్...!!

వొక రోజు రాసీట్నుం చి మూడు కొత్త పుస్తకాలు తెచ్చినాడు మా నాయన. వాటి పేర్లు గణిత శాస్త్రము, పరిసరాల విజ్ఞానం 1, పరిసరాల విజ్ఞానం 2. అంటే లెక్కలు, సామాన్య, సాంగీక. చింతచెట్టుకింది బళ్లో మాత్రం పుస్కాలు గిస్కాలూ ల్యా. ఐవోరు పలికిచ్చిందే అందరికీ సదువు. పొద్దు వాటారతా వుండంగా అశ్వనీభరణీలు, చైత్రావైశాఖలు, ప్రభవావిభవలూ పలికిచ్చినాఁక ఆఖరీన జనగణమన. అది పాడతా వుండంగానే మా రాతిమిద్దె బైట గూట్లో దాపెట్టిన కొత్తపుస్తకాల వాసన సాంబ్రాణీ వూదుకడ్డీల పొగ మాదిరిగా తీగలుతీగలుగా సాగుతా వచ్చి ముక్కులకు తగిలినట్టుగా వుంటాది. ...జయ జయహే... అంటాన్నెపాటికే రఁయ్యని పరిగేత్తుకోని యింట్లోకొచ్చి పలకాబలపం నులకమంచం మిందికి యిసిరిపారేసి, సామాన్యా సాంగీకా రెండుచేతలా పట్టుకొని వాటిల్లో మొగంబెట్టి మూజూడాల. వాటి కుండే వాసనంతా కడుపునిండా పీల్చి - యింగ రెండ్రోజులకు వీఁటి వాసన పోతాది గదా - అని ఉగ్గబట్టుకొన్నెంతసేపు ఉగ్గబట్టుకోని వదిలెయ్యాల. మహా అంటే ఈ కొత్త కరుకు వారముండునో పదిరోజులుండునో! ఎప్పుటికీ వుండేటట్టైతే అయ్యి కొత్తపుస్తకాలెందుకాయ? వాఁటె కోసరం నేను పరిగేత్తుకోని ఎందుకొజ్జును? *****************************************...

పిల్లోళ్లను కారిమింటుకు పంపీ

యండాకాలం శలవల్లో చింతచెట్టుకింద జిల్లాకోడి ఆడుకుంటావుంటే యింట్లోకి పిలిసి, పలకమీద A B C రాసి, దిద్ది నేర్చుకొని రాసిమ్మన్యాడు మా నాయిన. వాటిని బలపంతో రెండుసార్లు దిద్ది చెరిపేసి, టకీమని రాసి చూపిచ్చి, మల్లా చింతచెట్టుకిందికి పరిగెత్తినా. రోంచేపటికి మల్లా పిలిచి ఏబీసీడీలన్నీ రాసి పలికిచ్చి, రేపట్లోగా పలకడము, దిద్దడమూ నేర్చుకొమ్మనె. ఈ ఏబీసీడీలు పలకడం నాకు ముందే తెల్సు. "ఏబీసీడీయఫ్ - మీ తాత ఉఅ* ఠప్" అని ఒక పాటవుండేది. ఈ పాటతోనే నాకు ఏబీసీడీలు తెలిసింది. యింగ్లీసంటే ఏందో గూడా నాకు రెండోతరగతిలోనే తెల్సు. గాంధీతాత పాఠమొకటి వుంది. దాంతో తెల్లదొరలు, బ్రిటీషువారు, ఇంగ్లండు కూడా తెలుసు. ఆ తరువాత యాంట్ చీమ, బోయ్ బాలుడు, క్యాట్ పిల్లి వుండే బొమ్మలపుస్తకం కూడా నేర్చేసుకున్న్యా. "సదువంతా నువ్వే నేరిపిస్చావా, పిల్లోళ్లను కారిమింటుకు పంపీ" అని మా యింటికొచ్చిన పెద్దోళ్లంతా మా నాయనకు చెప్పబట్టిరి. ఆ 'కారిమింటు' నాకేం కొత్తదిగాదు. మా పల్లెకు సుమారిగా ఒక మైలు దూరాన వీరబల్లెలో వుంటాది శ్రీ శ్రీనివాస కాన్వెంటు. భట్టుపల్లె బళ్లో వొగటో తరగతి సదవంగానే, రెండో తరగతికి నన్ను దాంట్లోనే...