ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

పిల్లలూ దేవుడూ - బడితెపూజ

బోర్డుమింద ఆరు పేర్లుండాయి. కొన్ని పేర్లపక్కన ఇంటూలు గూడా వుండాయి. మాస్టర్ లేనప్పుడు మాట్లాణ్ణ్యామంజెప్పి, ఆ పేర్లేసింది క్లాసులీడరు రాశ్శేకర్. ఎందుకు మాట్టాణ్ణావు అనేది అనసరం. గొనిగినావా, గునిసినావా, గుసగుసలాణ్ణాఁవా, సైగజేసినావా అనేదిగూడా అనవసరం. మాట్టాణ్ణావా లేదా!? అంతవరకే. అస్సలు ములాజా లేదు. వొగసారి బోర్డుమింద పేరుబణ్ణాక, మల్లా మాట్టాడితే వొగ ఇంటూ. మల్లామాట్టాడితే యింగో ఇంటూ. పేరుపక్కన ఎన్ని ఇంటూలు బడితే వాని కర్మ ఆరోజు అంత బలంగా వున్నిట్టు. కర్మకన్నా బలవంతుడు మణ్యం. మణ్యం పేరుపక్కన ఇంటూలు బోర్డును దాటి గోడమీదిగ్గూడా బొయినయ్. వాని పేరు కిందనే నా పేరూ ఉండాది. ఇంటూల్లేవు. క్లాసురూము బయట మల్లికార్జునమాస్టర్ గొంతు యినబడింది. ఇంగో మాస్టర్‌తో కుశాలగా నవ్వుతా ఏందో మాట్టాడతాండాడు. ఆ గొంతు వెలుగు దగ్గరగా రాగానే, పిల్లకాయలంతా పుస్తకాల్లో తలలు దూర్చి ఒకటే దీక్షతో తపస్సుజేస్తున్నిట్టుగా సదవడం మొదులుబెట్న్యారు. బయట ఎంత నవ్వినా లోపలికి రాఁగానే ఆయన "మాస్టర్" అయిపోతాడని మాకుదెల్సు. మాస్టర్ అడుగుల సప్పుడు దగ్గరైంది. దూరంగా తోడేలు అలికిడి యినపడఁగానే మేత ఆపి, చెవులు రిక్కించి, బొబ్బరిచ్చుకొ...

చిరకాలమున్న నేకార్యమగును!?

వీరబల్లె. పదిహైదేండ్ల క్రితం. ఊరికి పడమట ఉన్న రక్షకభటనిలయం ఆవరణం లో... అప్పటికి దాని చుట్టూ ఇనుపకంచె లేదు, ఇప్పుడున్నంత బందోబస్తు లేదు, నక్సలైట్లు లేవు, వీధిలైట్లు మాత్రమే ఉండేవి. పొద్దుగూకి చానా సేపయింది. దట్టమైన పెద్దపెద్ద రావిచెట్ల గుంపు. అడుగడుక్కూ ఒక గూడు కట్టి కాకులు దాన్ని మరింత చిక్కగా చేశాయి. అవి గూళ్లకు చేరే వేళ మహా కోలాహలంగా ఉంటుందక్కడ. ఆ మానుల మీద పున్నమైనా సరే, కింద మాత్రం అమవాస్యే. పండు వెన్నెల. ప్రశాంతమైన గాలి. కాకులన్నింటికీ నిద్రపట్టినట్లుంది. ఒక కాకిపిల్ల మాత్రం మేలుకొనే ఉంది. "మ్మా..." వాళ్లమ్మ మెడ కింద మెల్లిగా ముక్కుతో గీకింది. "ఊఁ..." అలసి ఉన్నా ఓపిగ్గా మృదువైన కంఠంతో ఏమిటని అడిగింది అమ్మ. "పుట్టినరోజు పండగ మనింట్లో ఎప్పుడొచ్చాది?" ఎన్నో దినాలుగా అడగాలనుకొన్న సంగతి అడిగింది. అమ్మకు ఆ ప్రశ్న చాలా ముచ్చటగొలిపింది. మగతలోనే మురిపెంగా అంది - "నువ్వు బుట్టింది పున్నమినాడు నాయినా. ఆ యెన్నెట్లో సందమామ మాదిరి నిగనిగ మెరిసిన నిన్నుజూసి..." "మడే, ఈరోజు పొద్దన్నే పోలీసోళ్లింట్లో ... ఆ పండగ. మనింట్లో ఎప్పుడూ అని" "అదా, వాళ...