ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ఎర్రికాలంలో పీర్లపండగ సంబరం

మొహర్రమ్ మొన్నటిది. కానీ పీర్లపండగ నా చిన్నప్పట్నుంచీ వుంది.ఏమన్నా మాట్లాడితే తాతల కాలంనుంచి, వాళ్ల తాతల కాలంనుంచీ కూడా వుంది. మా అవ్వ చెప్పేది - ఈ పండగ నిజానికి ఓ ఇద్దరు సమరవీరులగురించిన సంతాపం అని. వీరబల్లె చుట్టుపక్కల ఏ పల్లెలోజూసినా సంతాపం కాదుగదా దాని వాసనగూడా కనబడేదిగాదు. "ఉసేను అనే వీరుడు ఇంగా కొంతమందీ, జనంకోసం రాజుకు ఎదురునిలబడి తలలుపోగొట్టుకొన్నారు. వాళ్ల తెగువ, ధైర్యం ఏపొద్దూగూడా మనమెవురమూ మరిసిపోకండా వుండేదానికే ఈ పండగ జేసుకొనేది. వొగో పీరు వొగో వీరునికి గుర్తు" ఇట్లా ఏదో చెప్పేది మాయవ్వ. నాకు మాత్రం ఉసేను చావకండా వుంటే బాగుండుననిపించేది. సరే ఎదురుదిరిగినారు, దొరికిపోయి ప్రాణాలుపోగొట్టుకొనేలోగా ఎంతమందిని చంపినారు అని అడిగితే మాయవ్వగ్గూడా తెలీదు. "వొగోరూ వొగ యిద్దర్నన్నా సంపింటారుగదువ్వా?" అంటే కూడా నాక్కావాల్సిన జవాబురాదు. సచ్చేలోపల ఒక్కణ్ణైనా సంపింటే బాగుండునని నా ఆశ. "సంపింటార్లేవ్వా" అనేసి తృప్తిపడేవాణ్ణి. "ఒక్కొక్కడూ ఒక్కణ్ణైనా తెగనరికి సంపిటార్లే" అని మరోసారి మనసులోనే గట్టిగా అనుకొని, తృప్తిపడి, మన పార్టీమనుషులు సచ్చినందుకు బాధపడ...

ప్రతి రాముడూ మంచి బాలుడే

పొద్దు తొలిసంచిక(డిసెంబరు-2006)లోని అతిథి శీర్షిక కోసం నా రచన. సంపాదకుల అనుమతితో ఇక్కడ పునఃప్రకాశం. [This is my writing for the guest column in the December-2006 issue of Poddu , republished here with permission from the editors of the e-gazine] “రాము పాటలు చాలాబాగా పాడతాడు”. ఇది విననట్లే కనిపిస్తున్నాడు కానీ, ఐదేళ్ల రాముకు ఈ మాట నచ్చింది. “ఔను. ఏదీ, నాయనా, ఒక పాట పాడు”. కొందరి ముఖాలు అప్పటికే రామును చూస్తున్నాయి “ఊ.. పాడాల్సిందే” అన్నట్లు. గుర్తింపు. ఆ గుర్తింపు తెచ్చే ఆనందకరమైన ఇబ్బంది. అ ఇబ్బందిని దాటి కొంచెం సర్దుకొంటుండగానే తనకోసం అందరికీ మధ్యలో చోటు సిద్ధం. అదొక సభ. అందులో ఇప్పుడు రాము ఒక సభ్యుడు. సభామర్యాదలింకా సరిగా తెలియకుండానే సభ్యసమాజంలో రేపటి పౌరుడు. కూర్చొని తనూ ఆనందిస్తూ పాడిన ఆ పాట పూర్తవగానే అభినందనల వెల్లువ, ఆ వెల్లువలోనే మరో పాట పాడాలంటూ ఎవరిదో కంఠం. ఇదే పాట మళ్లీ పాడాలని మరో అభ్యర్థన. విసుగనేది లేకుండా ఆ ఉత్సాహంలో అలా పాడేయటమే రాము పని. ఎక్కడైనా మనకు గుర్తింపు వున్నపుడు, అది కల్పించే ఆనందాన్నీ హోదానూ అనుభవిస్తున్నపుడు, దాన్ని కాపాడుకొనే బాధ్యత కూడా మన వెన్నంటే వుంట...