ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ఎవ్వరికోసం నీ మందహాసం

ముక్కావారి పల్లెలోని ఆంధ్రప్రదేశ్ బాలుర గురుకుల పాఠశాలలో చదవడానికి స్ధానం సంపాదించడం నా యీడు పిల్లకాయల్లో ఒక గొప్ప. ఎనిమిదో తరగతిలోకి నా ప్రవేశం. నేను మొట్టమొదటిసారిగా అమ్మానాయనలను వొదిలి దూరంగా స్కూలుహాస్టల్లో కొత్తగా చేరిన రోజు. మా వూరినుంచి ఆ బడికి ఎంపికైన ఇంకో పిల్లకాయ నారాయణ. మాకంటే రెండేంఢ్ల ముందు ఎంపికైన మావూరి యీర్నాగయ్య అక్కడ పదోతరగతి. బళ్లో చేరిపించినాంక మానాయనా నారాయణోళ్లనాయనా రాయచోటి బస్సెక్కి 'భద్రంగా ఉండండి' అన్జెప్తాండంగానే బస్సుకదిలిపాయ. అది కనబణ్ణందూరమూ చూస్తానే వుంటిమి. మెదడులో ఆలోచనలేమీ లేకండా ఖాళీ ఐపోయినట్టుంది నాకు. బళ్లోకి మెల్లిగా నడిచినాం. అదే ఆఖరిసారి మేం స్కూలు ప్రహరీని అనుమతిలేకుండా దాటి కడప-తిరుపతి రహదారి మీదకు అంత స్వేచ్చగా వెళ్లి నింపాదిగా రావడం. హాయిగా మన పనులన్నీ అమ్మానాయన చేస్తావుంటే సుఖంగా మంచి పప్పు నెయ్యి పెరుగు తింటూ పెరిగిన సౌకుమార్యానికిది పూర్తి విరుద్ధం. చిన్నచిన్న పొరబాట్లు చేస్తే 'పిచ్చినాయనా' అని మురిసిపోతూ సరిచేసి సాయంచేసే అవ్వ వుండదు. మార్గం కఠినం. ఇక్కడంతే. 'అయ్యో నాయనా దెబ్బ తగిలిందా' అనే ఓదార్పు మాటలిక్కడలేవు. దె...

దీపావళి - చివరికి మిగిల్చేది

నాకు తొమ్మిదేళ్లప్పుడు ఒక దీపావళి పండగొచ్చింది. పటాకుల రేట్లు జాస్తి ఐపొయినాయని పల్లెలో పెద్దోళ్లంతా అనుకొంటాండారు. "ఈసారేంకొనబళ్లా" అంటున్నారు నిష్ఠూరంగా. "మ్మా...పటాకులకు లెక్కగావాల" అని అమ్మనడిగితే "నాదగ్గిర్లేదు నాయనా, మీ నాయన్నడుగుపోండి" అని సమాధానం. నాయన్నడగడానికి యాడికోబోవాల్సిన పన్లేదు పక్కన్నే వుండాడు. అడగాల్సిన పనీలేదూ, నేనడిగింది యింటానే వుండాడు. కానీ అట్టమల్లుకోని యెనిక్కి చేతులుగట్టుకోని నీలుక్కోన్నిలబడి మెడ పైకెత్తి పెంకుటింటి వసారాకిందనించీ ఆకాశంలో మోడాలుజూచ్చాండాడు. వాతావరణం ఏంబాలేదు. ఐనాసరే, "నాయినా" మొండిగా పిల్చినా. "ఊఁ" నిలబడినకాణ్ణుంచి మెడగూడా తిప్పకండానే అన్నాగానీ మన పని జరుగుతుందనిపించి, "లెక్కగావాల". "దేనికి?" మా గోపీ నా పక్కనే వున్నాడు. వాడు నోరెత్తడంలా. సపోర్టు ఇవ్వకండా డబ్బిస్తే పటాకులుమాత్రం కొనుక్కుంటాడని నాకు వానిమింద ఉక్రోషం. "పటాకులకు" "అయ్యి కొని వాటిని కాల్చడమెందుకు, లెక్క గావాలంటే యిస్తా, తీస్కబొయి పొయ్యిలోబెట్టు, కాలిపోతుంది, పండగైపోతుంది" నా మెహం మాడిపోయింది ఈ...