ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

కంచు - కనకము - మంచి - చెడ్డ

శ్రీ శ్రీనివాస కాన్వెంట్లో నేను ఐదోతరగతి చదివేనాటి సంగతి. మా తరగతి గది కాన్వెంటు ఉత్తరద్వారానికి ఆనుకొని వుండేది. ఉత్తరద్వారం ఎదురుగా రోడ్డవతలున్న ఇంట్లో వీరబల్లె హైస్కూల్లో పన్జేసే టీచరొకాయనుండేవాడు. [రెండేళ్లక్రితమే ఈ హైస్కూలు జూ.కాలేజీ అయింది] ఆయనకు నాకంటే సుమారుగా పెద్దయిన ఇద్దరో ముగ్గురో కూతుళ్లు. నా ఐదోతరగతి మిత్రులంతా నాకంటే వయసులో కనీసం ఒక సంవత్సరం పెద్ద. *** *** *** ఎందుకంటే ... ఇదీ సంగతి: చింతచెట్టుకింద ఇసక. ఇసకమీద గాడ్రేజి కుర్చీ. కుర్చీలో నాగన్నసారు. నాగన్నసారు చేతిలో ఈతబర్ర [లేక ఈతబెత్తం]. ఆ బర్ర దెబ్బ తగలడానికి అనువైనంత దూరంలో నాగన్నసారు చుట్టూతా పిల్లకాయలు. ఈ రంగస్థల అధికార నామము: జిల్లా ప్రాథమిక పాఠశాల, భట్టుపల్లె గ్రా., వీరబల్లె మం. నా నాలుగో ఏటనే నా పాత్ర ఈ రంగస్థలప్రవేశం గావించబడింది. సాధారణంగా ఐదేళ్లు నిండిన పిల్లలను బళ్లో చేర్చేవాళ్లపుడు. *** *** *** శ్రీ శ్రీనివాస కాన్వెంట్లో నేను ఐదోతరగతి చదివేనాటి సంగతికి వస్తే... మనమే క్లాస్ ఫస్టు. మనమే క్లాస్ లీడరు. మనమే మాస్టర్లకు మేడంలకూ ప్రియశిష్యుడు. నాలుగో తరగతిలో నాకంటే మంచిమార్కులు తెచ్చుకొనే యిద్దురు పిల్లోళ్లు ఆ సంవ...

సత్యము మిమ్ము ముక్తులను చేయును

వీరబల్లెకూ పక్కనున్న వంగిమళ్ళకూ రెండు మైళ్ళ దూరం, మధ్యలో రెండేర్లు అడ్డం. జనాలు వీటిని యీరబల్లేరు [అసలు పేరు మాండవ్యనది], వొంగిమాళ్లేరు అని పిలుస్తారు. వంగిమళ్ళలో సరైన బడి లేకపోవడంతో పిల్లోళ్లంతా వీరబల్లెకు రోజూ నడిచి వొచ్చిపొయ్యేవాళ్ళు. అలా కష్టపడి పైకొచ్చినవాళ్ళు చాలామంది ఉన్నారు వంగిమళ్ళనుంచి. అప్పుడు నేను ఐదో తరగతి.ఆ చుట్టుపక్కల బాగా పేరు పొందిన శ్రీ శ్రీనివాసా కాన్వెంట్లో. వంగిమళ్ళ నుంచి మా చిన్నమ్మ కొడుకు మస్తాన్ రెడ్డి [ఒకటో తరగతి అప్పుడు] రోజూ నడవడం కస్టమని మా ఇంట్లోనే ఉండి బడికి పొయ్యేవాడు. ఒక సారి శెలవు రోజుల్లో నేను నా ఐదో తరగతి మిత్రులతో పాటు మస్తాన్ రెడ్డి వాళ్ళింటికిబోయినా. వాపసు వొచ్చేరోజు పొద్దున్నే మస్తాన్ రెడ్డికి రెండు నెలల కాన్వెంటు ఫీజుకని వాళ్ళమ్మ ఒక యాభై రూపాయల నోటు నా చేతికిచ్చింది. ఆ యాభయ్యి నేను చెడ్డీ జెబులో పెట్టుకొని ఆదరా బాదరా మిగతా పిల్లకాయలతో పాటు బడికి బయల్దేరినా. *** *** *** మరి, వంగిమళ్ళ పిల్లకాయలంతా ఉండారిప్పుడు...ఆడపిల్లలు కూడా. వొంగిమాళ్లేట్లో నీళ్ళకన్నా యిసకే ఎక్కువగా ఉంది. మన ప్రత్యేకత చూపడానికిది మంచి అదును అని పల్...