చిన్నప్పుడు నేను శానా సన్నగా వుండేవోణ్ణి. అందుకే మా ఇంట్లో నా పేరు వూసోడు. "ఊసన్నా" అనేవోడు మానాయన. పిలుపు యినబడతాన్నెపాటికే నాయన ఎదురుగా నిలబడాల. అది మాకిచ్చిన ట్రైనింగు. పిక్కల్లో పిడికెడు సియ్య ల్యాకన్న్యా, ఊసుకొవ్వు తక్కవ లేదమ్మా యీనికి, అనేది మాయవ్వ. ఆ అనడంలో వొగ మురిపెం వుంటాదిలే. మన బిడ్డలు పెద్దమొగోళ్లైపోతాండారు అని సంబరపడినట్టుగా వుంటాదామాట. అందుకే మాయవ్వ యేమన్న్యా పెద్దగా పట్టింపురాదు. మేము కొవ్వుపనులు చేసినా మమ్మల్ను యేమన్నా అనకపోతేనే పట్టింపు. అవ్వతో మాటామాట పెరిగితే "ఆ ముక్కు జూడు .. సక్కదనాల ముక్కు .. యెంత వందనంగా వుండాదో" అని యెక్కిరించేది. ఆమె పేరు చెన్నమ్మ. మాయవ్వకు తెలీని సంగతి వొగటుండాది. తెలీనప్పుడు మనమైనా చెప్పాల గదా అని, "నా ముక్కు చిన్నదైనా చెన్నమ్మ ముక్కుకంటే మేలైందేలే" అంటాననుకో, అప్పుడు మాయమ్మకు కోపమొచ్చేస్సాది. "వూసోడా, తన్నులు గావల్నా" అంటాది. నిజం జెప్పాల్నంటే, లోపల్లోపల అమ్మ నవ్వుకుంటా వుంటాది. పెండ్లికి ముందొకసారి మాయమ్మను చూసేదానికి వాళ్లింటికి వొచ్చిందంట మావవ్వ. అప్పుడు మా చిన్నమ్మ వొగామె, "ఎవురో కోసినట్టుగా...
మడిసన్నాక కూసింత కలా పోసన వుండాలన్నారు బాపు-రమణ !!