నాకు తొమ్మిదేళ్లప్పుడు ఒక దీపావళి పండగొచ్చింది. పటాకుల రేట్లు జాస్తి ఐపొయినాయని పల్లెలో పెద్దోళ్లంతా అనుకొంటాండారు. "ఈసారేంకొనబళ్లా" అంటున్నారు నిష్ఠూరంగా. "మ్మా...పటాకులకు లెక్కగావాల" అని అమ్మనడిగితే "నాదగ్గిర్లేదు నాయనా, మీ నాయన్నడుగుపోండి" అని సమాధానం. నాయన్నడగడానికి యాడికోబోవాల్సిన పన్లేదు పక్కన్నే వుండాడు. అడగాల్సిన పనీలేదూ, నేనడిగింది యింటానే వుండాడు. కానీ అట్టమల్లుకోని యెనిక్కి చేతులుగట్టుకోని నీలుక్కోన్నిలబడి మెడ పైకెత్తి పెంకుటింటి వసారాకిందనించీ ఆకాశంలో మోడాలుజూచ్చాండాడు. వాతావరణం ఏంబాలేదు. ఐనాసరే, "నాయినా" మొండిగా పిల్చినా. "ఊఁ" నిలబడినకాణ్ణుంచి మెడగూడా తిప్పకండానే అన్నాగానీ మన పని జరుగుతుందనిపించి, "లెక్కగావాల". "దేనికి?" మా గోపీ నా పక్కనే వున్నాడు. వాడు నోరెత్తడంలా. సపోర్టు ఇవ్వకండా డబ్బిస్తే పటాకులుమాత్రం కొనుక్కుంటాడని నాకు వానిమింద ఉక్రోషం. "పటాకులకు" "అయ్యి కొని వాటిని కాల్చడమెందుకు, లెక్క గావాలంటే యిస్తా, తీస్కబొయి పొయ్యిలోబెట్టు, కాలిపోతుంది, పండగైపోతుంది" నా మెహం మాడిపోయింది ఈ...
మడిసన్నాక కూసింత కలా పోసన వుండాలన్నారు బాపు-రమణ !!