వీరబల్లెకూ పక్కనున్న వంగిమళ్ళకూ రెండు మైళ్ళ దూరం, మధ్యలో రెండేర్లు అడ్డం. జనాలు వీటిని యీరబల్లేరు [అసలు పేరు మాండవ్యనది], వొంగిమాళ్లేరు అని పిలుస్తారు. వంగిమళ్ళలో సరైన బడి లేకపోవడంతో పిల్లోళ్లంతా వీరబల్లెకు రోజూ నడిచి వొచ్చిపొయ్యేవాళ్ళు. అలా కష్టపడి పైకొచ్చినవాళ్ళు చాలామంది ఉన్నారు వంగిమళ్ళనుంచి. అప్పుడు నేను ఐదో తరగతి.ఆ చుట్టుపక్కల బాగా పేరు పొందిన శ్రీ శ్రీనివాసా కాన్వెంట్లో. వంగిమళ్ళ నుంచి మా చిన్నమ్మ కొడుకు మస్తాన్ రెడ్డి [ఒకటో తరగతి అప్పుడు] రోజూ నడవడం కస్టమని మా ఇంట్లోనే ఉండి బడికి పొయ్యేవాడు. ఒక సారి శెలవు రోజుల్లో నేను నా ఐదో తరగతి మిత్రులతో పాటు మస్తాన్ రెడ్డి వాళ్ళింటికిబోయినా. వాపసు వొచ్చేరోజు పొద్దున్నే మస్తాన్ రెడ్డికి రెండు నెలల కాన్వెంటు ఫీజుకని వాళ్ళమ్మ ఒక యాభై రూపాయల నోటు నా చేతికిచ్చింది. ఆ యాభయ్యి నేను చెడ్డీ జెబులో పెట్టుకొని ఆదరా బాదరా మిగతా పిల్లకాయలతో పాటు బడికి బయల్దేరినా. *** *** *** మరి, వంగిమళ్ళ పిల్లకాయలంతా ఉండారిప్పుడు...ఆడపిల్లలు కూడా. వొంగిమాళ్లేట్లో నీళ్ళకన్నా యిసకే ఎక్కువగా ఉంది. మన ప్రత్యేకత చూపడానికిది మంచి అదును అని పల్...
మడిసన్నాక కూసింత కలా పోసన వుండాలన్నారు బాపు-రమణ !!